Gold Silver Price Today : బంగారం, వెండి కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి.. ఇవాళ ఏపీ, తెలంగాణలో ధరలు ఇవే..
Gold Silver Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది.
- Harish Thanniru
- Updated on- April 27, 2026 / 11:09 AM IST
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఆర్థిక మార్పుల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చేసుకుంటున్నాయి.
పశ్చిమాసియాలో రాజుకున్న ఆగ్రహజ్వాలలు ఇప్పట్లో చల్లారే పరిస్థితులు కనిపించడం లేదు. దీని ప్రభావం బంగారం ధరల మీద పడుతోంది. అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. అమెరికా- ఇరాన్ యుద్ధంతో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు మార్కెట్లను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నాయి.
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ.380 పెరిగింది. 22క్యారెట్ల బంగారంపై రూ.350 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 10డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ రేటు 4,718.42 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,54,420 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,41,550 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,54,570కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,41,700 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,54,420కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,41,550 వద్ద కొనసాగుతుంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,70,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,60,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,70,000వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
