Gold Silver Price Crash : గోల్డ్ ప్రియులకు బిగ్ అలర్ట్.. మళ్లీ భారీ మార్పులు.. ఈసారి తులం ఎంతంటే?

Gold Silver Price Crash : బంగారం, వెండి ధరల్లో నేడు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

1/7
Gold Silver Price Crash : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి తాజా ధరలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ధరలను పరిశీలిస్తే.. గోల్డ్ రేటు భారీగానే తగ్గింది. బుధవారం ఒక్కరోజు గోల్డ్ రేటు పెరగ్గా.. మిగిలిన నాలుగు రోజుల్లో గోల్డ్ రేటు తగ్గింది. అయితే, శనివారం (నేడు) గోల్డ్ రేటు పెరిగింది.
2/7
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ధరల కదలికలు, అమెరికా డాలర్ విలువలో మార్పులు, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, పెట్టుబడిదారుల కొనుగోళ్లు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతుంటాయి. ఈ కారణాల వల్లే దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
3/7
శనివారం ఉదయం నమోదైన వివరాలను పరిశీలిస్తే.. గోల్డ్ రేటు భారీగా పెరిగింది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.760 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.700 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 40 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ 4016 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,43,290 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,31,350 వద్ద కొనసాగుతోంది.
5/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,43,440 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,31,450 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,43,290కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,31,350 వద్ద కొనసాగుతోంది.
6/7
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,35,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,30,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,35,000 వద్ద కొనసాగుతోంది.
7/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు