Gold And Silver PriceToday : బంగారం ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. గోల్డ్ ఇప్పుడే కొనేయండి..! తులం ఎంతంటే?

Gold And Silver Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న శుభవార్త. నేటి గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా తగ్గాయి.

1/7
Gold And Silver PriceToday : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. గోల్డ్ రేటు తగ్గింది. గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర.. ఇవాళ ఒక్కసారిగా పడిపోయింది.
2/7
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గోల్డ్ రేటు భారీగా తగ్గింది. రానున్న రోజుల్లోనూ బంగారం ధర మరింత తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వెండి ధరసైతం భారీగా తగ్గింది.
3/7
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1,850 తగ్గగా.. 22క్యారెట్ల బంగారంపై రూ.1,700 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,029డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరసైతం తగ్గింది. ఇవాళ కిలో వెండిపై రూ.5వేలు తగ్గింది.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,44,330 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,32,300 వద్ద కొనసాగుతోంది.
5/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,44,480 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,32,450 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,44,330కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,32,300 వద్ద కొనసాగుతోంది.
6/7
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,40,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,35,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది.
7/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు