Gold And Silver PriceToday : గోల్డ్ ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఏపీ, తెలంగాణలో తులం రేటు ఎంతంటే?
Gold And Silver PriceToday : బంగారం ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గోల్డ్ రేటు భారీగా పెరగ్గా.. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
- Harish Thanniru
- Updated on- July 23, 2026 / 11:18 AM IST
Gold And Silver PriceToday : బంగారం, వెండి, కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నవారికి బిగ్ అలర్ట్. గోల్డ్ రేటు భారీగా పెరిగింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
బంగారం ధరల దూకుడు తగ్గడం లేదు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గోల్డ్ రేటు భారీగా పెరుగుతోంది. గడిచిన నాలుగు రోజుల్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై సుమారు రూ.4వేలు పెరిగింది.
గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 770 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 700 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 4,124 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,47,280 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,35,000 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,47,420 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,35,150 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,47,280కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,35,000 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,45,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,40,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు
