Chikungunya : గోమూత్రంతో చికెన్ గున్యూ తగ్గుతుందట.. ఐఐటీ పరిశోధనల్లో సంచలన ఫలితాలు

Chikungunya : గోమూత్రంతో చికెన్ గున్యూ తగ్గుతుందట.. ల్యాబ్ స్థాయిలో చేసిన పరీక్షల్లో గోమూత్రం.. చికున్‌గున్యా వైరస్‌పై భారీగా ప్రభావం చూపిందని పరిశోధకులు గుర్తించారు.

Chikungunya

Chikungunya : చికెన్ గున్యా.. దోమల ద్యారా వ్యాప్తి చెందే వైరస్.. ఈ వైరస్ బారినపడినవారికి అధిక జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ప్రస్తుతం ఈ వైరస్ నివారణకు ప్రత్యేకమైన యాంటీ వైరల్ మెడిషన్ అంటూ లేదు.

కేవలం లక్షణాలపై చికిత్స మాత్రమే అందిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదకరమైన వైరస్ నియంత్రణపై ఒక సంచలన పరిశోధన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే ఐఐటీకి చెందిన రూర్కీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన మరింత ఆసక్తిని రేపుతోంది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోసైన్సెస్ అండ్ బయోఇంజినీరింగ్‌కు చెందిన ప్రొఫెసర్ శైలీ టోమర్ నేతృత్వంలోని ఈ బృందం ఆయుర్వేదంలో వాడే గోమూత్ర డిస్టిలేట్ (Gau Mutra Ark)పై అనేక ప్రయోగాలు చేసింది. ల్యాబ్ స్థాయిలో చేసిన పరీక్షల్లో గోమూత్రం.. చికున్‌గున్యా వైరస్‌పై భారీగా ప్రభావం చూపిందని పరిశోధకులు గుర్తించారు.

Read Also : Schools Holiday : విద్యార్థులకు పండగే.. ఎల్లుండే మొహర్రం.. స్కూళ్లకు సెలవు..!

గోమూత్ర డిస్టిలేట్ వాడితే వైరల్ లోడ్ 90శాతం కన్నా ఎక్కువగా తగ్గినట్లు గుర్తించారు. అదేవిధంగా ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన బయోఆక్టివ్ కంపౌండ్స్ ద్వారా ఫార్ములేషన్ అయితే 99.85 శాతం వరకు వైరల్ లోడ్ తగ్గించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఈ ప్రభావానికి కారణమైన కొన్ని సహజ బయోఆక్టివ్ రసాయనాలను కూడా గుర్తించారు. ఈ అధ్యయనం ఏసీఎస్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే పీర్-రివ్యూడ్ జర్నల్‌లో పబ్లీష్ అయింది. దాంతో శాస్త్రీయత కూడా ఉంది. అయితే, ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కేవలం ల్యాబ్ రిజల్ట్స్ మాత్రమే.. మనుషులపై పరీక్షలు జరగలేదు. అందుకే, ప్రస్తుతం గోమూత్రాన్ని చికిత్సగా ఉపయోగించమని శాస్త్రవేత్తలు ఎక్కడా సూచించడం లేదు.

ఈ పరిశోధన సంప్రదాయ ఆయుర్వేద జ్ఞానాన్ని ఆధునిక బయోటెక్నాలజీతో కలిపి కొత్త ఔషధాల అభివృద్ధికి మార్గం చూపుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని అధ్యయనాలు జరిగితే కొత్త యాంటీ వైరల్ మందుల అభివృద్ధికి దారితీసే అవకాశం ఉందని భావిస్తున్నారు.