Hot milk or cold milk? Which is better for health?
పాలు మన భారతీయ ఆహార పరంపరలో ఒక ముఖ్యమైన భాగం. వీటిలో విటమిన్‌లు, ప్రోటీన్లు, కాల్షియం వంటి పోషకాలు పాలలో సమృద్ధిగా ఉంటాయి. కానీ చాలామందిలో ఉండే సందేహం ఏంటంటే వేడి పాలు మంచిదా? లేక చల్లని పాలు మంచిదా? కొంతమంది చల్లని పాలను తాగడానికి ఇష్టపడతారు. కొంతమంది వేడి పాలను ఇష్టపడతారు. మరి ఈ విషయంపై నిపుణులు ఎం చెప్తున్నారు? మనిషి ఆరోగ్యానికి ఏది మంచిది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
జీర్ణక్రియకు సహాయపడతాయి:
వేడి పాలు తాగటం వలన ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. కాబట్టి జీర్ణక్రియపై తక్కువ ప్రభావం పడుతుంది.
నిద్రకు సహాయపడతాయి:
వేడి పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ నిద్రను ప్రోత్సహిస్తుంది. శాంతియుతమైన నిద్ర కోసం రాత్రి వేడి పాలు తాగడం చాలా ఉపయోగపడుతుంది.
తక్షణ శక్తిని ఇస్తుంది:
వేడి పాలలో తేనె లేదా బాదం కలిపి తాగితే శక్తి తక్షణ వస్తుంది. ఇది శరీరాన్ని వేడి పరుస్తుంది కాబట్టి చలికాలంలో తాగడం మంచిది.
వేడి పాలను వేడి చేసి వెంటనే తాగడం వల్ల నోరు, ముక్కు దెబ్బతినే అవకాశం ఉంది. ఇంకాఅంతేకాకుండా, అధిక వేడి వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు.
శరీరానికి కూలింగ్ ప్రభావం:
చల్లని పాలు శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. వేసవి కాలంలో అధిక వేడి నుండి ఉపశమనం అందిస్తాయి.
ఆమ్లత (అసిడిటీ) నివారణ:
చల్లని పాలు పేగులోని ఆమ్లాన్ని తక్కువ చేస్తాయి. గ్యాస్, బర్బరిం, అసిడిటీ వంటి పొట్ట సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
చల్లని పాలు తాగటం వలన కొంతమందిలో జలుబు, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు కూడా వైద్యుల సూచన మేరకు మాత్రమే చల్లని పాలు తాగాలి.
వేడి పాలు లేదా చల్లని పాలు రెండు కూడా ఆరోగ్యానికి మంచివే. కానీ, ఏవి తాగాలి అనేది వ్యక్తిగత ఆరోగ్యం, వాతావరణ పరిస్థితులు, అవసరం మీద ఆధారపడి ఉంటుంది.