నోరూరించే ఇటువంటి ఆహార పదార్థాలను తింటున్నారా? క్యాన్సర్‌ను రా రమ్మని పిలుస్తున్నట్టే..
ల్యాబ్‌లో ఆ శాంపిళ్లను పరీక్షించి, ప్రమాదకర రసాయనాల మోతాదులను పరిశీలించారు.
Reused Cooking Oil
Reused Cooking Oil: మళ్లీ మళ్లీ మరిగిస్తూ ఉపయోగిస్తున్న నూనెలతో ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోంది. ముఖ్యంగా టిఫిన్ సెంటర్లు, వీధి చివర స్ట్రీట్ ఫుడ్ బండ్లలో వాడుతున్న నూనెలు ప్రజల ప్రాణాలకు ప్రమాదంగా మారుతున్నాయి.
రుచిగా ఉంటాయనే కారణంతో సమోసాలు, బజ్జీలు, పకోడీలు, దోశలు తరచూ తింటున్నాం. కానీ, అవి వేయించేందుకు ఉపయోగిస్తున్న నూనె నాణ్యతపై చాలామందికి అవగాహన లేదు. (Reused Cooking Oil)
ఒకసారి వేడి చేసిన నూనెను మళ్లీ మళ్లీ మరిగిస్తూ వాడితే అందులో ప్రమాదకర రసాయన సమ్మేళనాలు ఏర్పడతాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం. మళ్లీ మరిగించి వాడే నూనెల్లో ఫ్రీ రాడికల్స్, ట్రాన్స్ కొవ్వులు, ఆల్డిహైడ్స్ వంటి విషపదార్థాలు ఉత్పత్తి అవుతాయి.
Also Read: Rewind 2025: 2025లో విపరీతంగా వైరలైన 10 ఫొటోలు ఇవే..
పదే పదే మరిగిస్తూ ఉపయోగిస్తున్న నూనెలతో క్యాన్సర్ల ముప్పు పొంచి ఉంటుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. చాలా టిఫిన్ సెంటర్లతో పాటు స్ట్రీట్ ఫుడ్ షాపుల్లో నూనెలు భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేవని అందులో పరిశోధకులు తేల్చారు.
హైదరాబాద్‌లోని సరోజని నాయుడు వనిత మహావిద్యాలయ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పీజీ న్యూట్రిషియన్ డైటెటిక్స్‌లో ఆయా విషయాలు తెలిశాయి. చొల్లేటి వెన్నెల చోల్లెటి, అయ్యగారి వసుంధర నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది.
ఈ వివరాలు ఇన్ఫోమేటిక్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. నల్లగొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో టిఫిన్ సెంటర్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో నుంచి వాడుతున్న నూనెల నమూనాలను సేకరించి ఈ అధ్యయం చేశారు.
ల్యాబ్‌లో ఆ శాంపిళ్లను పరీక్షించి, ప్రమాదకర రసాయనాల మోతాదులను పరిశీలించారు. ఆ నూనెలలో టోటల్ పోలార్ కంపౌండ్స్ 38% ఉన్నట్టు తేల్చారు. టీపీసీ 25%లోపే ఉండాలి. అంతకు మించితే ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదకరంగా మారుతుంది.
వంట నూనె వినియోగంపై ప్రజల్లో చాలా మందికి సరైన అవగాహన లేదు. దీనిపై హోటళ్ల నిర్వాహకులకు శిక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెప్పారు. నూనె ముదురు గోధుమ లేదా నల్లగా మారితే దాన్ని మార్చేయాలి. నూనె కాలినట్లు లేదా మాడిపోయినట్టు వాసన వచ్చినా మార్చేయాలి. నూనెను వాడిన ప్రతిసారి వడగట్టాలి.
