Coffee Powder : కాఫీ పొడితో జుట్టును ఒత్తుగా, మృదువుగా మార్చటంతోపాటు చుండ్రు సమస్యను తగ్గించం ఎలాగంటే?
తెల్లబడిన శిరోజాలను నల్లగా మార్చే సహాజసిద్ధమైన కలర్ లా తోడ్పడుతుంది. కాఫీపొడిలోని డీహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచి, శిరోజాలు చిట్లే సమస్యను పోగొడుతుంది.
- Guntupalli Ramakrishna
- Published On : September 7, 2022 / 01:12 PM IST
hair thick and soft with coffee powder
Coffee Powder : ఘుమఘుమలాడే చిక్కటి కాఫీలోని కెఫీన్ మనసును ఉత్తేజ పరుస్తుంది. అలాగే ఎక్కువ కెఫిన్ మీ ఆరోగ్యానికి హానికలిగిస్తుంది. అయినప్పటికీ, ఇది మీ జుట్టుకు ఒక అద్భుతమైన పదార్ధంగా చెప్పవచ్చు. మానసిక స్థితిని పెంచడం, ఉదయం మిమ్మల్ని మేల్కొలపడంతోపాటు జుట్టును మెరిసేలా చేయటంలో కాఫీ ఒక సూపర్ ఇంగ్రిడియెంట్‌గా ఉంటుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, జుట్టును మెరిసేలా చేస్తుంది. ఆకృతిని మెరుగుపరుస్తుంది. కాఫీ పొడి నల్లని నిగనిగలాడే ఒత్తైన జుట్టు సొంతమయ్యేలా చేస్తుందంటున్నారు సౌందర్య నిపుణులు.
కాఫీపొడి శిరోజాలకు రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేసి, జుట్టు రాలే సమస్యను తొలగిస్తుంది. జుట్టు ఎదుగుదలలో ఉపయోగపడటమే కాకుండా, కుదుళ్లకు పోషకాలు చేరడానికి దోహదపడుతుంది. తెల్లబడిన శిరోజాలను నల్లగా మార్చే సహాజసిద్ధమైన కలర్ లా తోడ్పడుతుంది. కాఫీపొడిలోని డీహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచి, శిరోజాలు చిట్లే సమస్యను పోగొడుతుంది. కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టును ఒత్తుగా, మృదువుగా మెరిసేలా చేస్తాయి. మాడుకు క్లెన్సింగ్‌లా పనిచేసి శుభ్రపరిచి సూక్ష్మక్రిములు, ఫంగస్ వంటి ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి రక్షించి, చుండ్రు సమస్యను దరిచేరనివ్వదు.
జుట్టు సౌందర్యానికి కాఫీ పొడిని ఉపయోగించటం ఎలాగంటే ;
1. ఒక గిన్నెలో కప్పు పెరుగు, చెంచా కాఫీపొడి, అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే చాలు. ఈ లేపనం జుట్టుకు కండిషనర్‌లా పనిచేసి మృదువు, మెరుపును తెస్తుంది.
2. ఒక స్పూన్ కాఫీ పొడి, మయోనైజ్, గ్లిజరిన్ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి శిరోజాల చివర్ల వరకు మృదువుగా లేపనంలా రాయాలి. 45 నిమిషాలు ఆరనిచ్చి రసాయన రహిత షాంపుతో స్నానం చేస్తే చాలు. కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచి, శిరోజాలు చిట్లకుండా సంరక్షిస్తుంది.
3. ఒక స్పూన్ కాఫీ పొడికి రెండు విటమిన్ ఈ క్యాప్సుల్స్ కలిపి మాడుకు లేపనంలా రాసి అరగంట ఆరనివ్వాలి. గోరు వెచ్చని నీటితో శుభ్రపరిస్తే చాలు. ఒత్తైన జుట్టు సొంతమవుతుంది.
4. ఒక స్పూన్ కాఫీ పొడికి చెంచా కొబ్బరినూనె కలిపి నిద్రపోయే ముందు తలకు రాయాలి. ఉదయాన్నే తలస్నానం చేస్తే చాలు.
5. ఒక స్పూన్ కాఫీపొడికి ఆలివ్‌నూనె కలిపి తలకు రాసి పావుగంట మృదువుగా మర్దనా చేయాలి. 45 నిమిషాల తర్వాత చల్లని నీటితో తలస్నానం చేస్తే, శిరోజాలు మృదువుగా మారతాయి.
6.అలాగే చెంచా చొప్పున ఆర్గానిక్ ఆముదం, కాఫీపొడి కలిపిన మిశ్రమాన్ని నీటితో తడిపిన శిరోజాలకు లేపనంలా పట్టించాలి. గంట తర్వాత షాంపుతో స్నానం చేస్తే జుట్టు నల్లగా మారుతుంది.
