Benefits Of Kodo Millet : హైబీపీ, ర‌క్త‌హీన‌త‌, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ తగ్గాలంటే రోజు వారి ఆహారంలో వీటిని తీసుకోవటం ఉత్తమం!

అరికెల‌లో విట‌మిన్ బి6, నియాసిన్‌, ఫోలిక్ యాసిడ్‌, కాల్షియం, ఐర‌న్‌, మెగ్నిషియం, జింక్ అధికంగా ఉంటాయి. ఇవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పోష‌ణ‌ను అందిస్తాయి. డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు వచ్చినప్పుడు అరికెలను తీసుకుంటే రక్త శుద్ధి జరిగి త్వరగా కోలుకునేందుకు దోహదపడతాయి.

kodo millet

Benefits Of Kodo Millet : చిరు ధాన్యాల్లో అరికెలు ఒక‌టి. వీటిని కోడో మిల్లెట్స్ అనికూడా అంటారు. ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైబ‌ర్ ఇలా అనేక పోష‌క విలువ‌లు అధికంగా ఉంటాయి. ఆకలి తీర్చడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అరికెలు ద్వారా అందుతాయి. అరికెల‌తో అన్నం, ఉప్మా వంటివాటిని తయారు చేసుకుని ఆహారంగా తీసుకోవచ్చు.

అరికెల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది క‌నుక జీర్ణ స‌మ‌స్యలు ఉండ‌వు. ముఖ్యంగా గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. ప్రేగు క్యాన్సర్ వాటిని వాటిని దరిచేరకుండా అరికెలు నివారిస్తాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి అరికెలు మంచి ఆహారం. వీటిని తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించుకోవ‌చ్చు. అరికెలలో ఉండే పోషకాలు షుగర్ లెవెల్స్ రక్తంలో కలవకుండా అడ్డుకొని మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయి. మధుమేహగ్రస్తులకు మంచి హెల్దీ ఫుడ్ గా పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళ కలిగే బాధల ఉపశమనానికి, వాపులు తగ్గడానికి అరికెల మంచి ఆహరం. వాతరోగాలకు ముఖ్యంగా కీళ్ల వాతానికి, రుతుస్రావం క్రమంగా రాని స్త్రీలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు, కంటి నరాల బలానికి అరికెలు రోజు వారిగా తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క‌ణాలు దెబ్బ తిన‌కుండా సుర‌క్షితంగా ఉంటాయి.

అరికెల‌లో విట‌మిన్ బి6, నియాసిన్‌, ఫోలిక్ యాసిడ్‌, కాల్షియం, ఐర‌న్‌, మెగ్నిషియం, జింక్ అధికంగా ఉంటాయి. ఇవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పోష‌ణ‌ను అందిస్తాయి. డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు వచ్చినప్పుడు అరికెలను తీసుకుంటే రక్త శుద్ధి జరిగి త్వరగా కోలుకునేందుకు దోహదపడతాయి. అరికెలలో అధికమొత్తంలో మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందించి వ్యాధులతో పోరాడే శక్తిని పెంచుతాయి.

హైబీపీ, కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను అరికెలు త‌గ్గిస్తాయి. ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డేవారు వీటిని తింటే మంచిది. మ‌హిళ‌లు అరికెల‌ను తిన‌డం వ‌ల్ల వారికి నెల‌స‌రి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. గుండె జ‌బ్బులు ఉన్న‌వారు తింటే తీవ్ర‌మైన దుష్ప‌రిణామాలు ఏర్ప‌డ‌కుండా ముందుగానే నిరోధించ‌వ‌చ్చు. నిద్ర‌లేమి స‌మ‌స్య ఉన్న‌వారు రాత్రి పూట అరికెలతో కూడిన ఆహారం తీసుకుంటే నిద్రబాగా పడుతుంది. అరికెలలో ఉండే క్యాల్షియం ఎముకల దృఢత్వానికి సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు రోజువారి ఆహారంగా అరికెలు తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సులభంగా బరువును తగ్గించుకోవచ్చు. అరికెలను పిండిగా మార్చి రొట్టెలు, జావగా రూపంలో తీసుకోవచ్చు. అరికెలు నెమ్మదిగా జీర్ణం కావటం వల్ల ఎక్కువ సేపు ఆకలిని దరిచేరనివ్వవు.