కరోనా లక్షణాలు కనిపించాలంటే 5 రోజులు పడుతుంది!

  • Publish Date - March 10, 2020 / 03:40 PM IST

కరోనా వైరస్ సోకగానే వెంటనే లక్షణాలు కనిపించవు. సగటున కనీసం 5 రోజుల సమయం పడుతుంది. చాలామందిలో కరోనా లక్షణాలు 12 రోజుల్లో బయటపడతాయని రీసెర్చర్లు ధ్రువీకరించినట్టు ఓ రిపోర్టు తెలిపింది. దీనికి సంబంధించిన నివేదికను  journal Annals of Internal Medicine లో పబ్లిష్ చేశారు. అమెరికా కాలేజీ ఆఫ్ ఫిజిషియన్స్ చెప్పిన ప్రకారం.. 97.5 శాతం మందికి కొత్త వైరస్ లక్షణాలు 12 రోజుల్లోగా కనిపించినట్టు తెలిపింది.

సాధారణంగా వైరస్ ఇంక్యూబేషన్ పిరియడ్ సగటున 5 రోజుల సమయం పడుతుందని రీసెర్చర్లు తెలిపారు. ప్రస్తుత సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిఫార్సుల మేరకు కరోనా బాధితులను నిర్బంధించడం లేదా తమకు తామే ప్రత్యేక వార్డులో 14 రోజుల పాటు ఉండేలా చూడాలని సూచిస్తోంది. Bloomberg School of Public Health కు చెందిన రీసెర్చర్ జాన్స్ హోప్‌కిన్స్ చైనాలోని వుహాన్ బయట నుంచి 50 ప్రావెన్స్, ప్రాంతాలు, దేశాల్లోని రిపోర్టుల ఆధారంగా వైరస్ ఇంక్యూబేషన్ పిరియడ్ గుర్తించడంపై విశ్లేషించారు. 

వైరస్ ఇంక్యూబేషన్ పిరియడ్ ముగిసిన తర్వాత దాదాపు 181 మందిలో వైరస్ లక్షణాలను గుర్తించినట్టు రీసెర్చర్లు తెలిపారు. ప్రస్తుత డేటా ప్రకారం.. (COVID-19) వైరస్ ఇంక్యూబేషన్ పిరియడ్ 5.1 రోజుల్లోగా 97.5 శాతం మేర వృద్ధిచెంది క్రమంగా లక్షణాలు బయటకు కనిపిస్తాయి. అప్పటినుంచి 11.5 రోజుల్లోగా ఇన్ఫెక్షన్ లక్షణాలు పూర్తిగా బయటపడతాయి. CDC మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి 10వేల కేసుల్లో 101 కేసులను నిర్బంధ వార్డుల్లో పరీక్షించగా 14 రోజుల్లోగా వైరస్ లక్షణాలు బయటపడినట్టు రీసెర్చర్లు తెలిపారు. ఈ సీజన్‌లో అమెరికాలో ఇప్పటివరకూ 34 మిలియన్లమందికి ఫ్లూ సోకింది. దీని ఫ్లూ వైరస్ ఇంక్యుబేషన్ పిరియడ్ ఒక రోజు నుంచి నాలుగు రోజుల వరకు పట్టింది.  

ట్రెండింగ్ వార్తలు