Kids Health: జ్వరం వచ్చినప్పుడు మీ పిల్లలకు ఇవి అస్సలే తినిపించకండి.. ఎంత ప్రమాదమో తెలుసా?

జ్వరం వచ్చినప్పుడు పిల్లల(Kids Health) శరీరంలో వేడిగా మారుతుంది. శక్తి తగ్గిపోతుంది, బలహీనమవుతుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు

kids health these foods should not be given to children when they have a fever

Kids Health: జ్వరం వచ్చినప్పుడు పిల్లల శరీరంలో వేడిగా మారుతుంది. శక్తి తగ్గిపోతుంది, బలహీనమవుతుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఎలాంటి ఆహారాన్నైనా తినిపిస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు, వేడి పెరగడం, జ్వరం(Kids Health) మరింత పెరగడం వంటి ప్రమాదాలు తలెత్తుతాయి. కాబట్టి ఈ సమయంలో పోషకంగా, తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే ఇవ్వాలి. మరి పిల్లలు జ్వరం సమయంలో ఎలాంటి ఆహరం తీసుకోకూడదు అనే విషయం గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1.మసాలా పదార్థాలు:
మసాలాలు, నూనె అధికంగా ఉండే ఆహారాలు శరీర ఉష్ణాన్ని మరింతగా పెంచుతాయి. జీర్ణ వ్యవస్థ ఇప్పటికే బలహీనంగా ఉండడంతో అజీర్తి, వాంతులు, విరేచనాలు వచ్చే అవకాశముంది. పకోడీ, చిప్స్, నూకలు వేసిన కూరలు, ఫ్రైడ్ రైస్, తాలింపు ఎక్కువగా వేసిన భోజనం పెట్టకూడదు.

2.పాలతో చేసిన పదార్థాలు:
జ్వరం సమయంలో శరీరంలో శ్లేష్మ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. పాలు, చీజ్, పెరుగు లాంటి పదార్థాలు శ్లేష్మంను మరింత పెంచి దగ్గు, నసలు, కఫం వంటి సమస్యలను పెంచవచ్చు. చాక్లెట్ మిల్క్, క్రీమ్, ఐస్‌క్రీమ్, ఫ్లేవర్డ్ యోగర్ట్ వంటివి పిల్లలకు పెట్టకూడదు.

3.చల్లటి, ఐస్ పదార్థాలు:
చల్లటి పదార్థాలు తినడం వల్ల గొంతు కట్టిపోవడం, దగ్గు పెరగడం, టోన్సిల్స్ సమస్యలు రావచ్చు. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థపై ఒత్తిడి పెరిగి శరీర బలహీనమవుతుంది. ఐస్‌క్రీమ్, సోడాలు, శీతల పానీయాలు (Cool drinks), ఫ్రిజ్‌లో నిల్వ చేసిన ఆహారం తినిపించకూడదు.

4.చక్కెర అధికంగా ఉండే పదార్థాలు:
అధిక చక్కెర శరీర రోగనిరోధక వ్యవస్థ పనితీరును మందగింపజేస్తుంది. ఇన్ఫ్లమేషన్ పెరిగి జ్వరం మరింత ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి, కాండీలు, కేకులు, జ్యూస్ కాన్సంట్రేట్‌లు, పాకాలతో చేసిన మిఠాయిలు అస్సలు తీపించకూడదు.

5. ఎక్కువగా పచ్చి పదార్థాలు:
జ్వరం సమయంలో జీర్ణక్రియ బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో పచ్చి పదార్థాలు గ్యాస్, అజీర్తి వంటి సమస్యలకు దారితీయొచ్చు. శరీరానికి చల్లదనం ఎక్కువగా కలిగించే పుచ్చకాయ, మోసంబి, నిమ్మలాంటి పండ్లను ఎక్కువగా తినిపించడం వల్ల అసౌకర్యం కలగొచ్చు.