కరోనావైరస్ వ్యాక్సిన్‌ కోసం పనిచేస్తున్న ఆరు భారతీయ సంస్థలు

కరోనావైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఔషద దిగ్గజాలు COVID-19 కోసం వ్యాక్సిన్ తయారు చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

కరోనావైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఔషద దిగ్గజాలు COVID-19 కోసం వ్యాక్సిన్ తయారు చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మొత్తం ఆరు ఔషద తయారి భారతీయ కంపెనీలు కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం పనిచేస్తున్నాయి.

ఈ ప్రయత్నాలలో భారతీయ శాస్త్రవేత్తలు కరోనావైరస్‌కు వ్యతిరేకంగా ప్రపంచ పోరాటంలో భాగం అయ్యారు. భారత్‌కు చెందిన కంపెనీలే “జైడస్ కాడిలా రెండు వ్యాక్సిన్లపై పనిచేస్తుండగా, సీరం ఇన్స్టిట్యూట్ , బయోలాజికల్ ఈ, భారత్ బయోటెక్, ఇండియన్ ఇమ్యునోలాజికల్స్, మరియు మైన్వాక్స్ ఒక్కొక్కటి ఒక్కో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి” అని ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గగన్‌దీప్ కాంగ్ వెల్లడించారు.

మొత్తం ఆరు భారతీయ కంపెనీలు కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం పనిచేస్తుండగా.. టీకాలు పూర్తయ్యే దశలో ఉన్నట్లు మాత్రం చెప్పలేదు. ఒక వ్యాధికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే ప్రక్రియ సాధారణంగా సంవత్సరాల సమయం పడుతుంది. COVID 19 వ్యాక్సిన్ కూడా బయటకు వచ్చేందుకు కనీసం సంవత్సరం పట్టవచ్చునని అంటున్నారు. మార్కెట్‌లోకి దానిని తీసుకుని రావాలంటే.. టీకాను మొదట అభివృద్ధి చేసుకోవాలి. జంతువులపై పరీక్షలు చేసిన తర్వాత మానవులపై దానిని ప్రయోగిస్తారు.. అవి సురక్షితం నిరూపించుకుంటే అందుబాటులోకి వస్తుంది.