IT Employees Health Issues : డేంజర్‌లో టెకీలు.. దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల ఆరోగ్య స్థితిగతులపై అధ్యయనం

IT Employees Health Issues : ఉద్యోగుల్లో 22 శాతం మంది ఊబకాయం, 17 శాతం మంది ప్రి డయాబెటిస్‌, 11శాతం రక్తహీనత, హైపో థైరాయిడిజంతో, 7 శాతం మధుమేహంతో ఇబ్బంది పడుతున్నట్లు అధ్యయనంలో తేలింది.

IT Employees Health Issues : మీరు ఐటీ ఉద్యోగులా? మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటున్నారా? తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారా? ఇవన్నీ ఎందుకంటే.. ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు.. వారి హెల్త్‌ పారామీటర్స్‌ అస్తవ్యస్థంగా ఉన్నట్లు హెచ్‌సీఎల్‌ హెల్త్‌ కేర్‌ సంస్థ స్పష్టం చేసింది. మీరు ఐటీ ఉద్యోగులా? మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటున్నారా? తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారా? ఇవన్నీ ఎందుకంటే.. ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు.. వారి హెల్త్‌ పారామీటర్స్‌ అస్తవ్యస్థంగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఐటీ ఉద్యోగుల్లో డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి. వాళ్ల ఉద్యోగాలకు వచ్చిన నష్టం ఏమీ లేకున్నా.. ఆరోగ్యపరంగా చాలా డేంజర్‌లో పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 56 వేల మంది ఐటీ ఉద్యోగుల ఆరోగ్య స్థితిగతులపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. వీరిలో 77 శాతం మంది ఆరోగ్య చాలా అస్తవ్యస్థంగా ఉన్నట్లు తేల్చింది.

Read Also : Apple iPhone 14 discount : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.57వేలకే సొంతం చేసుకోవచ్చు!

ముఖ్యంగా 61 శాతం మంది అధిక కొవ్వు సమస్యతో బాధపడుతున్నట్లు పేర్కొంది. క్లినికల్‌ స్టడీ చేసిన తర్వాత హెచ్‌సీఎల్‌ హెల్త్‌కేర్‌ ఈ వివరాలు వెల్లడించింది. ఈ స్టడీని 25-40ఏళ్లలోపు వారిపై చేశారు. దేశంలోని కార్పొరేట్‌ వ్యవస్థల్లో పనిజేసే ఉద్యోగుల్లో అనారోగ్య పరిస్థితులు పెరుగుతున్నాయి.

ఐటీ ఉద్యోగుల్లో అధికంగా ఆరోగ్య సమస్యలివే :
ప్రీడయాబెటీస్‌, డయాబెటీస్‌, ప్రి హైపర్‌టెన్షన్‌, రక్తపోటు, రక్తహీనత, హైపోథైరాయిడిజమ్‌, అధిక కొవ్వులాంటి ఆరోగ్య సమస్యలు ఐటీ ఉద్యోగుల్లో అధికంగా ఉన్నాయి. ఉద్యోగుల్లో 22 శాతం మంది ఊబకాయం, 17 శాతం మంది ప్రి డయాబెటిస్‌, 11శాతం రక్తహీనత, హైపో థైరాయిడిజంతో, 7 శాతం మధుమేహంతో ఇబ్బంది పడుతున్నట్లు అధ్యయనంలో తేలింది.

ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరూ ఒకటికంటే ఎక్కువ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పాతికేళ్లలోపు వారిలో కొవ్వు స్థాయిలు చాలా అస్తవ్యస్థంగా ఉన్నాయి. వీరిలో 14 శాతం మంది రక్తహీనతతో, 13 శాతం ఊబకాయంతో, 8 శాతం హైపోథైరాయిడిజంతో, 7శాతం ప్రిడయాబెటిస్‌తో బాధపడుతున్నారు. వయసు పెరిగే కొద్ది ఈ సమస్యలు పెరిగే అవకాశాలున్నాయి.

ప్రధానంగా 40ఏళ్లు దాటిన వారిలో చాలా ప్రమాదకరస్థితిలో ఈ పారామీటర్స్‌ పెరుగుతున్నాయి. కేవలం 23శాతం మంది ఉద్యోగుల హెల్త్‌ పారామీటర్స్‌ తగిన స్థాయిల్లో ఉన్నాయి. ఇక పరీక్షలు చేయించుకున్న వారిలో 37శాతం మందికి ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఉండగా 26శాతం మందిలో రెండు, 11శాతం మందిలో 3 రకాల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నట్లు తెలిపింది. సాధారణంగా నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజ్‌లన్నీ 40ఏళ్ల తర్వాతే బయటపడుతుంటాయి. కానీ ఐటీ ఉద్యోగుల్లో మాత్రం ఇవి 30 ఏళ్లలోపే కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం వారి జీవనశైలేననే తేలింది.

జీవనశైలితో పాటు ఇతర చెడు అలవాట్లు :
ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 నుంచి 35 ఏళ్లు దాటి తర్వాత ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఐటీ ఉద్యోగులు అయితే తప్పకుండా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా జంక్‌ ఫుడ్స్‌, రెడీమేడ్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ తీసుకుంటున్నారు. అలాగే గంటల కొద్దీ ఒకేచోట కదలకుండా కూర్చుంటున్నారు. ఇలాంటి జీవనశైలి వల్ల వారిలోచాలారకాల అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి.

ఐటీ ఉద్యోగులు ఎక్కువగా యాంత్రిక జీవన శైలిని గడుపుతున్నారు. రివర్స్‌ టైమ్‌లో పనిజేస్తుంటారు. అందుకే వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువ. రేయింబవళ్లు పని, వ్యాయామం లేకపోవడం, సరైన డైట్‌ పాటించకపోవడం, స్మోకింగ్‌, మద్యపానం, సరిగా నిద్రపోకపోవడం లాంటివాటితో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

ఈమధ్యకాలంలో టెకీల్లో సంతానలేమి సమస్య కూడా పెరుగుతోందంటుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. బీపీ, షుగర్‌ను కనీసం 6 నెలలకొకసారైన చెక్‌ చేయించుకోవాలి. ఐటీ కంపెనీల యాజమాన్యాలు సైతం విధిగా తమ ఉద్యోగులకు పరీక్షలు చేయించాలి. దాంతో ముందస్తుగా వారి ఉద్యోగుల్లోని అనారోగ్య సమస్యలు గుర్తించవచ్చు.

Read Also : China Teen Zhou Chuna : అభిమాన నటిలా కనిపించాలని 100కు పైగా ప్లాస్టిక్ సర్జరీలు.. రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన యువతి

ట్రెండింగ్ వార్తలు