×
Ad

Anemia During Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో రక్తహీనతతో బాధపడుతున్నారా? ఇది బిడ్డ ఎదుగుదలలో లోపాలకు దారితీస్తుందా?

ప్రెగ్రెన్సీ సమయంలో రక్తహీనత లోపం ఏర్పడితే సాధారణంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అలసటగా , బలహీనంగా అనిపిస్తుంది. తల తిరగడం, శ్వాస ఆడకపోవుట, వేగవంతమైన హృదయ స్పందన, ఏకాగ్రతలో సమస్యలు వంటివి ఉత్పన్నం అవుతాయి. కొన్ని రకాల పరీక్షల ద్వారా రక్తహీనత సమస్యను గుర్తించవచ్చు.

anemia during pregnancy

Anemia During Pregnancy : గర్భవతిగా ఉన్నప్పుడు చాలా మందిలో రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. రక్తహీనత ఉన్నప్పుడు,  రక్తంలో కణజాలాలకు మరియు శిశువుకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు ఉండవు. గర్భధారణ సమయంలో, శిశువు పెరుగుదలకు తోడ్పడటానికి  శరీరం ఎక్కువ రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది. తగినంత ఐరన్ తోపాటు కొన్ని ఇతర పోషకాలు అందకపోతే శరీరం ఈ అదనపు రక్తాన్ని తయారు చేయడానికి అవసరమైన ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయలేదు. గర్భవతిగా ఉన్నప్పుడు తేలికపాటి రక్తహీనత కలిగి ఉండటం సాధారణం. అయితే తక్కువ ఐరన్, విటమిన్ స్థాయిలు తక్కువగా ఉండటం ఇతర కారణాల వల్ల తీవ్రమైన రక్తహీనత బారినపడే అవకాశాలు ఉంటాయి.

ప్రెగ్నెన్సీలో రక్తహీనత ఉంటే విపరీతమైన నీరసం, అలసట ఉంటాయి. ఏ పనినీ చురుకుగా చేసుకోలేరు. ఐరన్‌ లోపంతో కడుపులో బిడ్డ ఎదుగుదల సమస్యలు తలెత్తుతాయి. ఇది తీవ్రంగా ఉన్నప్పుడు చికిత్స చేయకపోతే, ఇది ముందస్తు ప్రసవం వంటి తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ సమయంలో ఐరన్‌ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఫోలేట్ లోపం వల్ల అనీమియాకు దారితీస్తుంది. ఫోలేట్ అనేది ఆకుపచ్చ ఆకు కూరలు వంటి కొన్ని ఆహారాలలో సహజంగా లభించే B విటమిన్, ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలతో సహా కొత్త కణాలను ఉత్పత్తి చేయడానికి శరీరానికి ఫోలేట్ అవసరం తప్పనిసరి.

గర్భవతిగా ఉన్న సమయంలో ఐరన్ కోసం ఆకు కూరలు, పప్పులు, దానిమ్మ, డ్రై ఫ్రూట్స్ వంటివి రోజూ తీసుకోవాలి. క్యారెట్, బీట్‌రూట్‌ , టమాటా జ్యూసెస్‌, విటమిన్‌ సి ఎక్కువగా ఉండే కమలాపళ్లు, నిమ్మ వంటివి తీసుకోవాలి. ఐరన్ లోపం ఉన్నవారికి వైద్యులు ఐరన్ మాత్రలు సూచిస్తుంటారు. ఐరన్ మాత్రలు కొందమందిలో వికారం, వాంతులకు కారణమౌతుంటాయి. విటమిన్ సి మాత్రలతో ఐరన్ మాత్రలు ఇస్తే ఇలాంటి సమస్య ఉండదు.

ప్రెగ్రెన్సీ సమయంలో రక్తహీనత లోపం ఏర్పడితే సాధారణంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అలసటగా , బలహీనంగా అనిపిస్తుంది. తల తిరగడం, శ్వాస ఆడకపోవుట, వేగవంతమైన హృదయ స్పందన, ఏకాగ్రతలో సమస్యలు వంటివి ఉత్పన్నం అవుతాయి. కొన్ని రకాల పరీక్షల ద్వారా రక్తహీనత సమస్యను గుర్తించవచ్చు. రక్తహీనత సమస్య వల్ల తక్కువ బరువుతో బిడ్డ పుట్టటం, ప్రసవ సమయంలో రక్తం ఎక్కించాల్సి రావటం, ప్రసావానంతరం రక్తహీనత, శిశువు అభివృద్ధిలో లోపాలు, వెన్నుముక, మెదడులో సమస్యలు తలెత్తే అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు రక్తహీనత సమస్యను సకాలంలో గుర్తించటం మంచిది.