Protect Heart Health : మధుమేహాం సమస్యతో బాధపడుతున్న వారు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏంచేయాలంటే !
ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవటం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు, రంగురంగుల కూరగాయలు , గింజలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన ఆహారాలను ఎంచుకోవాలి.
diabetes
Protect Heart Health : గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం అనేవి రెండు దీర్ఘకాలికాలంలో ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఈ రెండు దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి. ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. గుండె జబ్బు గా పిలిచే కార్డియోవాస్కులర్ వ్యాధి, గుండెపోటు, స్ట్రోకు, గుండె వైఫల్యం వంటి పరిస్థితులకు దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మరణాలకు ప్రధాన కారణం. మధుమేహం లేని వారితో పోలిస్తే మధుమేహం ఉన్నవారు హృదయ సంబంధ వ్యాధుల బారినపడే అవకాశం రెండు నుండి నాలుగు రెట్లు ఎక్కువ. ఎందుకంటే డయాబెటిస్‌లో రక్తంలో అధిక చక్కెర స్థాయిలు గుండె రక్త నాళాలను నియంత్రించే నరాలను దెబ్బతీస్తాయి. ఇది ధమనులు గట్టిపడటానికి దారితీస్తుంది.
READ ALSO : Heart Diseases : గుండె సంబంధిత వ్యాధులకు కారకాలు, నివారణ మార్గాలు !
మధుమేహం అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు , ఊబకాయం వంటి హృదయ సంబంధ వ్యాధుల ఇతర ఆరోగ్యపరమైన ఇబ్బందులకు కారణం అవుతాయి. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి, మధుమేహం ఉన్న వ్యక్తులు వారి రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా అందుపులో ఉంచుకోవాలి. సాధారణ శారీరక శ్రమ, సమతుల్య ఆహారం, ధూమపానం మానేయటం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. రెగ్యులర్ చెక్-అప్‌లతోపాటు షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు ప్రమాదం తగ్గుతుంది.
డయాబెటిస్తో బాధపడుతున్న వారు ఆరోగ్యాన్ని పర్యవేక్షించటానికి అనుసరించాల్సిన అంశాలు ;
గుండెకు మేలు చేసే ఆహారం తీసుకోవం: కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే సంతృప్త , ట్రాన్స్ ఫ్యాట్లను నివారించాలి. ఉదాహరణకు, సంతృప్త కొవ్వులు సాధారణంగా వెన్న, గొర్రె మాంసం ,ఫ్యాట్ కలిగిన పాల ఉత్పత్తులలో కనిపిస్తాయి, అయితే ట్రాన్స్ ఫ్యాట్స్ వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలలో ,హైడ్రోజనేటెడ్ నూనెలలో ఉంటాయి. ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవటం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు, రంగురంగుల కూరగాయలు , గింజలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన ఆహారాలను ఎంచుకోవాలి.
READ ALSO : Heart Disease : మధుమేహం నుండి అధిక కొలెస్ట్రాల్ స్థాయిల వరకు గుండె జబ్బులు రావటానికి 5 ప్రమాద కారకాలు !
రోజువారి వ్యాయామం: గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి వ్యాయామం అన్నది కీలకం. ఊబకాయం, రక్తపోటు మరియు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు వంటి అంశాలను వ్యాయామం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. రెగ్యులర్ శారీరక శ్రమ మధుమేహాన్ని అదుపులో ఉంచటంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి , నిశ్ఛల జీవనం లేకుండా చూసుకోవటం, వేగంగా నడక , సైక్లింగ్ వంటివాటిని అనుసరించాలి. ప్రతి వారం కనీసం 150 నిమిషాల శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి.
రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించటం: ఫ్రీస్టైల్ లిబ్రే వంటి CGM సాధనాల ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు ఎంతఉన్నాయి అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవటం మంచిది. రోజులో కనీసం 17 గంటల పాటు గ్లూకోజ్ (70 – 180 mg/dl) ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మధుమేహం, గుండె జబ్బుల పోటు ప్రమాదాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు.
ధూమపానం , మద్యపానానికి స్వస్తి: ధూమపానం రక్త నాళాల పొరను దెబ్బతీస్తుంది, మధుమేహం వల్ల గుండె ధమనులు గట్టిపడటాన్ని వేగవంతం చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. మధుమేహం మరియు ధూమపానం గుండె జబ్బుల ప్రమాదం మరింత పెరిగిలే చేస్తుంది. కాబట్టి ధూమపానం మానేయడం ముఖ్యం.
READ ALSO : Reducing Diabetes : మధుమేహం తగ్గించటంలో ఔషధంగా కాకరకాయ రసం !
ఆల్కహాల్ తీసుకోవడం కూడా తగ్గించాలి. ఎందుకంటే ఇది డయాబెటిస్ మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. అధిక మద్యపానం రక్తపోటును పెంచుతుంది. గుండె కండరాలను బలహీనపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
ఒత్తిడి తగ్గించుకోవటం: ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ఒత్తిడి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ నిరోధకతను కలిగించి కాలక్రమేణా, ఇది రక్తపోటును పెంచుతుంది. గుండె జబ్బులకు కారణమవుతుంది.
ఒత్తిడిని తగ్గించుకోవడానికి, సంగీతం వినడం, యోగా లేదా డ్యాన్స్ వంటి కార్యకలాపాలలో పాల్గొనటం మంచిది. స్నేహితులతో సమయం గడపడం వంటి వాటి ద్వారా ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి.
READ ALSO : Benefits of Makhanas : గుండె ఆరోగ్యం, మధుమేహ నియంత్రణలో మఖానాస్ తో కలిగే 10 అద్భుతమైన ప్రయోజనాలు
ఈ అంశాలతో పాటుగా మరికొన్ని జాగ్రత్తలు పాటించటం ద్వారా డయాబెటిస్ ఉన్న వారు గుండె జబ్బుల ప్రమాదం బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించటం ద్వారానే ఇదంతా సాధ్యమవుతుందన్న విషయం మర్చిపోకూడదు.
గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు పాటించటం మంచిది.
