Heart Diseases : గుండె సంబంధిత వ్యాధులకు కారకాలు, నివారణ మార్గాలు !

ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నట్లుగా గుండెపోటులు , స్ట్రోక్‌లకు ప్రధాన కారణంగా భావిస్తున్న పొగాకు వినియోగం తగ్గించాలి. దీని వల్ల హృదయ ఆరోగ్యం త్వరగా తెబ్బతింటుంది. సిగరెట్లు, ఇ-సిగరెట్‌లలో నికోటిన్ హృదయ స్పందనల్లో తేడాలు, అధిక రక్తపోటు స్థాయిలకు దారితీస్తుంది.

Heart Diseases : గుండె సంబంధిత వ్యాధులకు కారకాలు, నివారణ మార్గాలు !

Heart Diseases

Heart Diseases : హృదయ సంబంధ వ్యాధులు గుండె మరియు రక్త నాళాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. గుండెపోటుకు సంబంధించిన ప్రమాద కారకాలలో ధూమపానం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, మధుమేహం, అధిక బరువు , ఊబకాయం, వంటివాటితోపాటు అనేక ఇతర కారకాలు ఉన్నాయి. కొన్ని హృదయ సంబంధ వ్యాధులకు కుటుంబ చరిత్ర పై అధారపడి ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, మెటబాలిక్ సిండ్రోమ్, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితులు రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్ అలాగే HIV/AIDS ఇన్‌ఫెక్షన్, గర్భధారణ సమయంలో ఎదురయ్యే సమస్యలు, ముందస్తు మెనోపాజ్‌ వంటివి గుండెపోటుకు అదనపు ప్రమాదకారకాలుగా చెప్పవచ్చు.

READ ALSO : Nutritious Food : చర్మ సహజ కాంతిని కోల్పోతున్నారా? అయితే పోషకవిలువలు కలిగిన ఆహారం తీసుకోవటం బెటర్ !

వీటితోపాటు గుండె సంబంధించి వ్యాధులకు వాయు కాలుష్యం కూడా కారణమని నిపుణలు చెబుతున్నారు. కంటికి కనిపించని కాలుష్యకారకాలు దీర్ఘకాలికాలంలో బయటపడని అనేక అంతర్గత ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటాయి. వీటితో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. కాలుష్య కారకాలను పీల్చడం ద్వారా ఈ పదార్థాలు రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. రక్తనాళాలలో ప్రతిస్పందనల్లో మార్పులకు, అడ్డంకులు ఏర్పడటానికి , ధమనుల దృఢత్వానికి దారితీస్తాయి. నిద్రలేమి, జీవనశైలిలో మార్పులు, సహా వివిధ కారణాలు హృదయ సంబంధ వ్యాధులు పెరగటానికి కారణమవుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

READ ALSO : Breastfeeding : చంటిబిడ్డలకు పాలిచ్చే తల్లులు ఎలాంటి ఆహారం తీసుకోవటం మంచిదంటే ?

ఆరోగ్య నిపుణుల సూచనలు ;

ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నట్లుగా గుండెపోటులు , స్ట్రోక్‌లకు ప్రధాన కారణంగా భావిస్తున్న పొగాకు వినియోగం తగ్గించాలి. దీని వల్ల హృదయ ఆరోగ్యం త్వరగా తెబ్బతింటుంది. సిగరెట్లు, ఇ-సిగరెట్‌లలో నికోటిన్ హృదయ స్పందనల్లో తేడాలు, అధిక రక్తపోటు స్థాయిలకు దారితీస్తుంది. ధూమపానం వల్ల ధమనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. రక్తం గడ్డకట్టే పరిస్ధితి పెరుగుతుంది. ముఖ్యంగా, పొగతాగని వ్యక్తులు సైతం పొగసేవించేవారికి దగ్గరగా ఉండటం వల్ల సెకండ్‌హ్యాండ్ స్మోక్‌కి గురికావడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

READ ALSO : Tomatoes Bad For Arthritis : ఆర్థరైటిస్‌తో బాధపడేవారు ఆహారంలో టమోటాలను తీసుకోకూడదు ఎందుకో తెలుసా ?

వయస్సు మరియు కుటుంబ చరిత్ర వంటి కొన్ని ప్రమాద కారకాలను అడ్డుకోలేము. అయితే హృదయ సంబంధ వ్యాధులు రాకుండా అడ్డుకోవటంలో జీవనశైలి ఎంపికలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడిని తగ్గించుకోవటం, తగినంత నిద్ర, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం, గాలి నాణ్యతపై శ్రద్ధ చూపడం అన్నది గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవటానికి దోహదం చేస్తాయి.