అమెరికా.. ఈ మాట వింటేనే ఉలిక్కిపడుతున్నారు స్టూడెంట్స్. ఇండియాలోని పేరంట్స్ గుండెలు అదురుతున్నాయి. అమెరికా అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటికే ఓ యూనివర్సిటీ షెట్ డౌన్ అయ్యింది. ఇప్పుడు మరో 5 యూనివర్సిటీలు ఇదే బాటలో ఉన్నాయనే వార్తలు చక్కర్లు కొడుతుండటంతో.. అమెరికాలోని స్టూడెంట్స్ తోపాటు ఇండియాలోని వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళనలో పడ్డారు.
ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగా ఉన్నా.. అప్పులు చేసి మరీ పిల్లలను అమెరికాకు పంపిస్తున్నారు. అక్కడికి వెళ్లాక పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. అమెరికాలో ప్రైవేట్ వర్సిటీలపై ప్రభుత్వానికి నియంత్రణ ఉండటం లేదు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వర్సిటీల్లో అడ్మిషన్లు ఉంటాయని అమెరికా చెబుతుంటే.. నిర్వాహకులు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఇదే విదేశీ విద్యార్థులను శాపంగా మారుతోంది. ఫర్మింగ్‌టన్ వర్సిటీ తరహాలోనే ఇతర రాష్ట్రాల్లోని ఐదు ప్రైవేట్ వర్సిటీలూ అనధికార కార్యక్రమాలు నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఆ ఐదు వర్సిటీలను మూసివేయించాలన్న నిర్ణయానికి అమెరికా ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఐదు వర్సిటీల్లోని 80 వేల మంది విదేశీ విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. వీటిలో 50 వేల మంది భారత విద్యార్థులు ఉన్నట్లు అంచనా. నకిలీ వర్సిటీ ఫర్మింగ్‌టన్‌లోని 130 మంది తెలుగు విద్యార్థులపై అక్కడి పోలీసులు కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారు. ఈ ఐదు వర్సిటీలు కూడా మూతబడితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని అమెరికాలోని తెలుగు సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.
వలసదారులు 2019, ఫిబ్రవరి 5వ తేదీలోపు అమెరికా విడిచి వెళ్లిపోవాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మాస్టర్స్ కోర్సు పూర్తయ్యాక.. పీజీ కోర్సులు చేస్తూ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ వస్తున్నారు స్టూడెంట్స్. అలాంటి వారిని గుర్తించి స్వదేశానికి పంపించాలనే ఉద్దేశంతో.. హోంల్యాండ్ పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేశారు. మూడేళ్లలో 600 మంది స్టూడెంట్స్ ఫర్మింగ్‌టన్ వర్సిటీలో అడ్మిషన్లు పొందరు. వీరి నుంచి లక్షల రూపాయలు ఫీజులు కూడా వసూలు చేశారు. ఇదే తరహాలో మరో ఐదు యూనివర్సిటీలు మూసివేతకు సిద్ధంగా ఉన్నాయనే వార్తలు.. అమెరికాలోని తెలుగు స్టూడెంట్స్ కు నిద్రలేకుండా చేస్తున్నాయి. కొన్ని రోజుల్లోనే ఈ వర్సిటీల అక్రమాలు కూడా బయటకు వస్తాయని (TAONA) తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ప్రతినిధి మోహన్ చెప్పటం అందరిలో కలకలం మొదలైంది.
Read Also: జీవితం తలకిందులు : అమెరికాలో హైదరాబాద్ అమ్మాయి దీనగాథ
Read Also: ఫార్మింగ్టన్ యూనివర్సిటీ కేసు : ఆ 8మంది డిటెన్షన్‌పై విచారణ
Read Also: అమెరికాలో నిర్బంధం : హైదరాబాద్ కు చేరిన 30 మంది విద్యార్థులు
Read Also: అమెరికాలో దారి తప్పిన చదువులు : హైదరాబాద్‌లో తెలుగు విద్యార్థులు