తెలంగాణలో చట్టాన్ని కొనలేరు.. సీఎం జగన్ కు బండ్ల గణేష్ రిక్వెస్ట్

  • Publish Date - October 6, 2019 / 09:58 AM IST

సినిమా నిర్మాతలు పీవీపీ, బండ్ల గణేష్ ల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఆర్థికపరమైన విభేదాలు కారణంగా ఇద్దరు నిర్మాతలు.. పోలీసులకు ఫిర్యదులు చేసుకుని  టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయారు. బండ్ల గణేష్.. పీవీపీ మధ్య గొడవలు కేసుల వరకు వెళ్లగా.. లేటెస్ట్ గా ఇదే విషయమై నిర్మాత, నటుడు బండ్ల గణేష్.. సోషల్ మీడియా వేదికగా ట్వీట్లతో పీవీపీపై విరుచుకుపడ్డారు.

తెలంగాణలో చట్టాన్ని, న్యాయాన్ని డబ్బులిచ్చి కొనలేమని స్కామ్ రాజా గుర్తించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధర్మమే జయిస్తుందంటూ పరోక్షంగా టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేశారు. ఒక్కొక్కరికీ ఒక్కో టాలెంట్ ఉంటుందని, ఈ స్కామ్ రాజాకు దొంగ సంతకాలు పెట్టే టాలెంట్ ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. ఆ కళకు ఎందరో స్నేహితులు బలవగా.. ఆఖరికి సొంత అన్నను కూడా బలికూడా అంటూ ట్వీట్ చేశారు.

పరారీలో ఉన్నారని చెబుతున్న బండ్ల గణేశ్.. తనకు పీవీపీ, ఆయన అనుచరుల నుంచి ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బండ్ల గణేష్.. సీఎం జగన్ కు కూడా సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేశారు. అద్భుతమైన పరిపాలన అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారూ.. స్కామ్ రాజా నుంచి ఇండస్ట్రీని ప్రజలను కాపాడండి అంటూ బండ్ల ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ చేశారు.