పాతబస్తీలో హైటెన్షన్ : రెండు వర్గాల మధ్య ఘర్షణ

  • Publish Date - September 19, 2019 / 02:08 AM IST

పాతబస్తీలో నడి రోడ్డుపై యువకులు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కిందపడేసి కాళ్లతో తన్నారు. రోడ్డుపై వెళుతున్న వారు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఘర్షణకు సంబంధించిన దృశ్యాలను కొంతమంది సెల్ ఫోన్‌లలో బంధించారు. 

కామాటీపూరాలో సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం అర్ధరాత్రి రెండు గ్రూపులుగా విడిపోయిన యువకులు కర్రలతో దాడులకు దిగారు. వారిని ఎవరూ అడ్డుకోలేదు. ఓ యువకుడిని దూషించడంతో ఘర్షణకు దిగినట్లు పోలీసులు భావించారు. స్థానికుల కంప్లయింట్‌తో పోలీసులు రంగ ప్రవేశం చేసి కేసు నమోదు చేశారు. తీవ్ర గాయాల పాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘర్షణలో 12 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. వీరి కోసం గాలిస్తున్నారు పోలీసులు.