2020ని మహిళా రక్షణ-రోడ్డు భద్రతా సంవత్సరంగా ప్రకటించిన డీజీపీ

రాష్ట్రంలో వందశాతం అక్షరాస్యత సాధించేందుకు సీఎం కేసీఆర్‌ ‘ఈచ్‌వన్‌-టీచ్‌వన్‌' కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ‘ఈచ్‌వన్‌-టీచ్‌వన్‌' కార్యక్రమంలో పోలీస్ శాఖ పాల్గొంటుందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

  • Publish Date - January 3, 2020 / 10:28 AM IST

రాష్ట్రంలో వందశాతం అక్షరాస్యత సాధించేందుకు సీఎం కేసీఆర్‌ ‘ఈచ్‌వన్‌-టీచ్‌వన్‌’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ‘ఈచ్‌వన్‌-టీచ్‌వన్‌’ కార్యక్రమంలో పోలీస్ శాఖ పాల్గొంటుందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో వందశాతం అక్షరాస్యత సాధించేందుకు సీఎం కేసీఆర్‌ ‘ఈచ్‌వన్‌-టీచ్‌వన్‌’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ‘ఈచ్‌వన్‌-టీచ్‌వన్‌’ కార్యక్రమంలో పోలీస్ శాఖ పాల్గొంటుందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రతి పోలీస్ యూనిట్ కనీసం 20 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలన్నారు. 

సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమంలో చిత్తశుద్ధిలో పాల్గొనాలని చెప్పారు. మన రక్షణకై పోలీస్ శాఖ ఉందనే నమ్మకాన్ని పౌరుల్లో కల్పించాలని సూచించారు. పోలీస్ శాఖలో నిరంతరం శిక్షణా తరగతులు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు.  

తెలంగాణలో వందశాతం అక్షరాస్యత సాధించేందుకు సీఎం కేసీఆర్‌ ‘ఈచ్‌వన్‌-టీచ్‌వన్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీఎ కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వివిధ ప్రభుత్వ శాఖలు తప్పకుండా ఈచ్ వన్-టీచ్ వన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలని తెలిపారు.