పేషెంట్లకు తక్షణ వైద్య సహాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పేషెంట్లకు సేవలు అందించడానికి ఇప్పటికే బైక్ అంబులెన్స్‌లు తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు మరో కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. యాక్సిడెంట్ అయి ప్రమాదానికి గురైన వారికి తక్షణ సాయం అందించడానికి అంబులెన్స్ వచ్చే లోపే అక్కడికి డ్రోన్ వస్తుంది. ప్రాథమిక చికిత్స చేసేందుకు సరిపడా సామాగ్రిని తీసుకుని అక్కడికి చేరుస్తుంది.
Also Read : ‘రియల్ కర్మ్ యోగి’లకు.. మోడీ రూ.21 లక్షల విరాళం
రోడ్ యాక్సిడెంట్ ల ద్వారా మరణించే వారిలో దాదాపు 60 శాతం మంది సకాలంలో హాస్పిటల్‌కు తీసుకెళ్లకపోవడంతోనే మృతి చెందుతున్నారని ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్సిస్టిట్యూల్(ఈఎమ్ఆర్ఐ) తెలిపింది. ఈ కిట్ సహాయంతో దగ్గర్లో ఉన్న వైద్య సిబ్బంది రక్తస్రావాన్ని అదుపుచేసేందుకు ఉపయోగపడుతుంది.
ఈ డ్రోన్ లను ఉపయోగించడానికి డ్రోన్‌లు నడపడంలో ఎక్స్‌పర్ట్స్ ను సిబ్బందిగా నియమించనున్నారు. అయితే డ్రోన్‌లకు అధికారిక అనుమతి లేకపోవడంతో పబ్లిక్ ప్రదేశాల్లో తిరిగేందుకు ప్రభుత్వం నిరాకరిస్తూ వస్తుంది. ఈ విషయంలో చర్చలు జరిపి అనుమతులు తీసుకొస్తామని ఈఎమ్ఆర్ఐ మేనేజర్ కే.దేవేందర్ తెలిపారు.
డ్రోన్‌ల ద్వారా వైద్య సహాయం అందించడం తెలంగాణలో కొత్తేం కాదు. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ పీసీలో డా. సురేశ్ మునుస్వామీ టీబీ పేషెంట్లకు మందులను డ్రోన్ ల ద్వారానే అందించేవారు. ప్రతి వారం ఒక రకమైన మందులు వాడాల్సిన పేషెంట్లకు ఇంటికే నేరుగా మందులు పంపేవారట.
Also Read : దడ పుట్టించాడులే : దూరదర్శన్ ట్యూన్ తో బ్రేక్ డ్యాన్స్