శ్రీ సత్యసాయి సేవా సంస్థ..నిరుద్యోగ స్త్రీలకు ఉచిత శిక్షణా

  • Publish Date - March 21, 2019 / 05:30 AM IST

శ్రీ సత్యసాయి సేవా సంస్థలు శివం ఆధ్వర్యంలో నిరుద్యోగ స్త్రీల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది…నిరుద్యోగ స్త్రీలకు గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సు, వ్యక్తిత్వ వికాసం, ఆత్మ విశ్వాసము పెంపొందించేందుకు ఈ నెల (మార్చి 25,2019) తేదీ నుంచి నగవంలో ఉచిత శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 28 సంవత్సరాల వయసు కలిగి డిగ్రీ చదివి ఉండాలి.

కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న మహిళలకు మాత్రమే ప్రవేశాలు ఉంటాయని తెలిపారు. 45 రోజుల పాటు నిర్వహించే ఈ తరగతులలో హాజరు కావాలనుకునే వారికి ఈ నెల (మార్చి 24,2019)న నల్లకుంట శివంలో ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు 9010632555, 9182902028 నెంబర్‌లలో సంప్రదించాలని కోరారు. వివిధ జిల్లాల నుంచి మహిళలు ఇక్కడ చేరేందుకు ముందుకు వస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు ఉద్యోగం, స్వయం ఉపాధి పొందే వరకు బైరెడ్ అధికారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తారు.