తెలంగాణ కేబినెట్ విస్తరించారు సీఎం కేసీఆర్. ఆరుగురికి మంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు. సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
తొలుత హరీష్ రావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల, సత్యవతి రాథోడ్, పువ్వాడలు ప్రమాణం చేశారు. అనంతరం పాత, కొత్త మంత్రులతో గవర్నర్, సీఎం కేసీఆర్ ఫొటో దిగారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 9 నెలల తర్వాత కేబినెట్ విస్తరిస్తున్నారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం కేబినెట్ సభ్యుల సంఖ్య 12గా ఉంది. ప్రస్తుతం చేసిన ఆరుగురితో కేబినెట్ సంఖ్య 18కి చేరింది. ప్రమాణ స్వీకారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువరు సీనియర్ నేతలు పాల్గొన్నారు.