హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఆకాశం మేఘావృతం అయ్యింది. దట్టమైన మేఘాలతో చీకట్లు కమ్మేశాయి. భారీ వర్షం పడింది. హైదరాబాద్ సిటీ మొత్తం ఇలాంటి పరిస్థితే ఉంది. చాలా ప్రాంతాల్లో వర్షం భారీగా పడుతుంది. రోడ్లు జలమయం అయ్యాయి.
చార్మినార్, కోటి, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, కూకట్ పల్లి, మియాపూర్ ప్రాంతాల్లోనూ జోరు వాన పడుతుంది. ఉన్నట్లుండి వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం 4 గంటల సమయానికే.. ఆరు గంటలు అయ్యిందా అన్నట్లు అయ్యింది.
భారీ వర్షంతో చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచాయి. వెహికల్స్ స్లోగా వెళుతున్నాయి. వీకెండ్ అందులోనూ.. వరసగా మూడు రోజులు హాలిడేస్ రావటంతో.. చాలా మంది ఆఫీసుల నుంచి త్వరగా ఇళ్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ టైంలో వర్షం పడటంతో ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగులు.