MRPS సభ నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

  • Publish Date - April 30, 2019 / 12:09 PM IST

హైదరాబాద్:  మే 8వ తేదీన ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో తలపెట్టిన అంబేద్కర్ వాదుల మహా గర్జన సభకు  హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభ అనుమతి కోసం ఇప్పటికే మూడు సార్లు పోలీసులను కోరినా, సభ నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడంతో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సభ నిర్వహణకు అనుమతి ఇచ్చింది.ఇందిరా పార్కు లో మే 8 న మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సభ జరుపుకోవాలని, ఎలాంటి అల్లర్లు సృష్టించకుండా ప్రశాంతమైన వాతావరణం లో సభ నిర్వహించుకోవాలని పిటిషనర్ కు హైకోర్టు సూచించింది.
Also Read : తగలబడిన ఫైళ్లు మిమ్మల్ని కాపాడలేవు మోడీజీ