ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో హైదరాబాద్ కు చెందిన 14 ఏళ్ల ఇషా సింగ్ సత్తా చాటింది. ఖతార్‌లోని దోహాలో జరిగిన 14 వ ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్ 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఇషా సింగ్ ..2022 యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడమే తన లక్ష్యం అని అన్నది. 9 సంవత్సరాల వయస్సులో షూటింగ్ ప్రారంభించానని చెప్పింది. తాను చాలా కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నానని.. దీనికి చాలా అంకితభావం అవసరమని తెలిపింది.
తాను ఈరోజు ఈ స్థాయికి చేరుకోవటానికి చాలా కష్టపడ్డాననీ..కష్టపడితే సాధ్యం కానిదంటూ లేదని తెలిపింది. 2022 యూత్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించటమే నా లక్ష్యం అంటోంది హైదరాబాద్ అమ్మా ఇషా సింగ్. ఆల్ ది బెస్ట్ ఇషా..
It was not an easy journey for the 14-year-old Esha Singh, who left a remarkable feat in 14th Asian Shooting Championship in Doha by bagging 3 Gold medals in the junior category, as she had to give up her social life for shooting
Read @ANI Story |https://t.co/dbfNzxBqqW pic.twitter.com/oDyncE0H4M
— ANI Digital (@ani_digital) November 15, 2019