కేసు రిజిష్టర్ చేసుకోండి బాబూ అని నాలుగు పోలీస్ స్టేషన్లకు తిరిగినా ఒక్కరూ పట్టించుకోలేదు. పట్టుదలతో పది గంటల పాటు తిరిగి ఎట్టకేలకు రోడ్ యాక్సిడెంట్ కేస్ ఫైల్ చేయగలిగాడు. ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు అన్ని తిప్పలు పెట్టడం పట్ల హైదరాబాద్ సిటీ కమిషనర్ అజంనీకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో బంజారా హిల్స్, హుమాయున్ నగర్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లను, పంజాగుట్ట, బంజారాహిల్స్‌లలో పనిచేస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లను ట్రాన్సఫర్ చేశారు. సెప్టెంబర్ 29న మసబ్ ట్యాంక్ జంక్షన్ వద్ద తన హోండా సిటీ కారును ఢీకొట్టింది. డ్రైవర్ షీబుతో పాటు కారులో ఉన్న ఇద్దరు మహిళలకు కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు.
కారులో ప్రయాణిస్తున్న బాధితుల్లో ఒకరైన ప్రియాంక తాము బంజారా హిల్స్ రోడ్ నెం.12నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. ఆ ప్రమాదానికి మా కారు రోడ్ డివైడర్ ను ఢీకొట్టింది. రోడ్ మీద వెళ్తున్న వారు పోలీసులు రాకముందే మమ్మల్ని దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. ఆ తర్వాతి రోజు బాధిత కుటుంబాల్లోని వ్యక్తులు కేసు ఫైల్ చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తేనే అసలు సమస్య ఎదురైంది.
‘కేసు నమోదు చేయడానికి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్తే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లమని, అక్కడకు వెళ్తే హుమాయున్ నగర్‌కు వెళ్లాలని పోలీసులు సూచించారు. చివరికి పది గంటలపాటు తిరిగిన తర్వాత సైఫాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు’ అని ఆమె తెలిపింది. ఆ తర్వాత బాధితులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌ను కలవడంతో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు.
బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్‌పెక్టర్ బి. శ్రీనివాస్, కానిస్టేబుల్ రంజిత్‌కుమార్, హోంగార్డు బి. అంజయ్య, హుమాయున్‌నగర్ సబ్ ఇన్స్‌పెక్టర్ కె. సత్యనారాయణ, పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ రిసిప్షన్‌లో విధుల్లో నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వి. ఏలేశ్వరకిరణ్‌లను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. జవాబుదారితనంతో ఉండాల్సిన సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.