రోడ్డుపై వాహనాలు నడిపేవారిని అదుపుచేయాలని సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్, హెల్మెట్ లెస్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్, తప్పుడు పద్ధతిలో యూ టర్న్ క్రాస్ చేయడం, రాష్ డ్రైవింగ్‌లకు డిజిటల్ ఫొటోలు తీసి ఫైన్ వేస్తున్నా ఏ మాత్రం కనువిప్పు కలగటం లేదు. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో నగరవాసులంతా.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు భారీ మొత్తంలో బాకీపడ్డారు. దాదాపు రూ.63 కోట్ల వరకూ బాకీలు చెల్లించాల్సిన బైకులే రోడ్డుపైన చలామణి అవుతున్నాయట.
Read Also: భారత్ చాలా బలంగా ఉంది: పాకిస్తాన్‌కు ట్రంప్ వార్నింగ్
ప్రత్యేక రాష్ట్రం విడిపోక ముందు నుంచి జనవరి 2019వరకూ చెల్లించాల్సిన నిధుల బాకీల సమచారం ఆర్టీఐ ఎంక్వైరీలో బయటపడింది. అక్షయ్ కుమార్ అనే వ్యక్తి ఆర్టీఐ ఎంక్వైరీ చేసి ఈ సమాచారాన్ని బయటపెట్టాడు. పెద్ద మొత్తంలో నిలిచిన టూ-వీలర్స్ బాకీలు రూ. 53,25,22,590గా ఉంటే ఆర్టీసీ బస్సులు కూడా రూ.7,60,535 వరకూ ఫైన్‌లు చెల్లించకుండా తిరుగుతున్నాయట. ఇంకా కార్లు రూ. 5,01,88,675 ఇవ్వాల్సి ఉండగా ఆటోల పెండింగ్ బిల్లులు రూ. 3,07,08,475గా ఉన్నాయి.
Read Also: గ్రే లిస్ట్ లో పాకిస్తాన్: భారత్ ప్రయత్నాలు ఫలించేనా?
ఈ ట్రాఫిక్ బాకీలంతా.. కేవలం హైదరాబాద్ కమిషనరేట్‌కు సంబంధించినవే కావడం గమనార్హం. కోల్‌కతా వంటి నగరాల్లో ట్రాఫిక్ పోలీసులు పెండిగ్ బిల్లులు చెల్లించడానికి వచ్చిన వాహన యజమానుల ముందు కొత్త ఆఫర్లతో 25 నుంచి 50 శాతం డిస్కౌంట్‌లు తీసుకొస్తున్నారు. కానీ, హైదరాబాద్‌లో అలాంటివేమీ కనిపించకపోగా, బిల్లులు చెల్లించాల్సిన వారు సైతం భారీ మొత్తం పెరిగే వరకూ చూస్తూ ఉండిపోతున్నారు.
అప్పుడప్పుడు రెగ్యూలర్ చెకప్‌లలో వాహనాలపై ఉన్న పెండింగ్ బిల్లులు ట్రాఫిక్ పోలీసులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయట. గతేడాది వందకు పైగా పెండింగ్ చలాన్స్ ఉన్న రెండు బైక్‌లను పోలీసులు స్వాధీనపరచుకున్నారు. వాటిలో ఒకదానిపై 102 ఫైన్‌లతో రూ.16,525 కాగా, రెండో దానిపై 120 ఫైన్‌లతో రూ.19,930.
Read Also: గెట్ రెడీ : రైల్వేలో 1.3 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్