పాకిస్తాన్ లో హైదరాబాద్ కు చెందిన ప్రశాంత్. మధ్య ప్రదేశ్ కు చెందిన దారిలాల్ ను పాకిస్తాన్ పోలీసులు అరెస్టు చేశారు. కొలిస్తాన్ ఎడారిలో పాస్ పోర్టు, వీసాలు లేకుండా వచ్చారని ఆరోపిస్తూ పట్టుకున్నారు. ప్రశాంత్ హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ గా పనిచేస్తున్నాడు. ప్రేమికురాలి కోసం పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టాడు.
అమ్మాయి వదిలేసి వెళ్లిపోవడంతో దారి తెలియక కొలిస్తాన్ ఎడారిలోకి అడుగుపెట్టాడు. సరిహద్దులు దాటి అయోమయంగా తిరుగుతుండగా పాక్ లోని బహవల్ పూర్ పోలీసులు అదుపు తీసుకున్నారు. వీరిద్దరిపై ఉగ్రవాది కింద కేసు నమోదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ప్రశాంత్ తెలుగులో మాట్లాడి నేను క్షేమంగానే ఉన్నాను. కోర్టుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎంబస్సీని సంప్రదించి విడుదలయ్యేందుకు ఏర్పాట్లు చేస్తారని పాక్ నుంచి మాట్లాడి తెలిపాడు.