మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిగా అసబద్ధంగా, తప్పులతడకగా ఉందంటూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

  • Publish Date - January 3, 2020 / 03:51 PM IST

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిగా అసబద్ధంగా, తప్పులతడకగా ఉందంటూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిగా అసబద్ధంగా, తప్పులతడకగా ఉందంటూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 5 కిలో మీటర్ల లోపు ఉన్న ఓటర్లను మరో పోలీంగ్‌ స్టేషన్‌లకు మార్చారని, ఒకే కాలేజీలో 300 ఓట్లను చూపించారని కోర్టుకు పిటిషనర్లు తెలిపారు. సర్వే నెంబరు, ప్లాట్‌ నెంబరుపై ఓట్లను చూపించారని కోర్టుకు వెల్లడించారు. 

2014లో ఎన్నికల షెడ్యూల్‌లో రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌కు 10రోజుల సమయం ఇచ్చారని, కానీ ఇప్పుడు ఒక్క రోజు మాత్రమే సమయం ఇస్తున్నారని పేర్కొన్నారు. జనవరి 6న రిజర్వేషన్లు ప్రకటించి.. 7న ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వడం చట్టవిరుద్ధమని కోర్టుకు విన్నవించారు. కనీసం 10 రోజుల సమయమైన ఇవ్వాని పిటిషన్లర్లు కోర్టును కోరారు. 90 శాతం ఎస్సీలను బీసీలుగా చూపిస్తూ అవకతవకలకు పాల్పడుతున్నారని తెలిపారు. 

పిటిషన​ర్ల తరపు వాదనలు కొనసాగుతుండగా అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) రామచందర్‌రావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ సక్రమంగా చేపట్టామని తెలిపారు. చిన్న చిన్న లోపాలు ఉన్నా..వాటిని సరిచేశామని చెప్పారు. గతంలో దాఖలైన పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఓటర్ల జాబితా, రిజర్వేషన్లపై డివిజన్ బెంచ్ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. 

ప్రజల అభ్యంతరాతలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నామని ఏఏజీ తెలిపారు. ఈసీ ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని… జనవరి 6న ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. కొంత సమయమిస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ఏఏజీ తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. 
 

ట్రెండింగ్ వార్తలు