ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు ఒకేసారి విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు కురిశాయి. 24 గంటల్లో వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఏకంగా 19 సెం.మీ. కుండపోత వర్షం కురిసింది. నర్సంపేటలో 15 సెం.మీ. అతి భారీ వర్షం నమోదైంది.
ఇవాళ, రేపు కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.