పెళ్లికి వెళ్లివస్తుండగా..దారి కాసి కత్తులతో పొడిచి హత్య 

  • Publish Date - November 17, 2019 / 05:20 AM IST

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.  ఫిరోజ్ అనే వ్యక్తిని దుండగులు కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

చింతల్ మెంట్ కాలనీకి చెందిన ఫిరోజ్ ఓ వివాహా వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా..అదే కాలనీకి చెందిన వ్యక్తులు దారి కాసి ఫిరోజ్ పై కత్తులతో దాడి చేసి అత్యంత పాశవికంగా దాడి చేశారు. రక్తం మడుగులో కొట్టు మిట్టాడుతున్న ఫిరోజ్ ను హాస్పిటల్ కు తరలిస్తుండగా దారి మధ్యలోనే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. అనంతరం దర్యాప్తులో భాగంగా.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు.