కేన్సర్ జాకెట్ : మహిళా పారిశుధ్య కార్మికులకు పరీక్షలు

  • Publish Date - September 18, 2019 / 04:27 AM IST

మనుషులను కబలిస్తున్న మహమ్మారి ఇది. ప్రధానంగా మహిళలకు వచ్చే రొమ్ము కేన్సర్ ప్రమాదకరమైంది. ముందస్తు పరీక్షలు నిర్వహిస్తే..దీనిని నివారించవచ్చు. కానీ కొంతమందికి దీనిపైన అవగాహన లేదు. మరోవైపు పరీక్షలకు భారీగా డబ్బు ఖర్చువుతుండడంతో ఎందరో మహిళలు వ్యాధి ముదిరే వరకు గుర్తించలేకపోతున్నారు. దీనిపై GHMC దృష్టి సారించింది.

తక్కువ ధరకే వ్యాధిని గుర్తించే టెక్నాలజీతో ప్రత్యేక జాకెట్లు, కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. 8 ఏళ్ల ముందే కేన్సర్ సొకే ప్రమాదాన్ని గుర్తించవచ్చు. ప్రాథమిక నిర్దారణతో తదుపరి అవసరమైన చికిత్సలు పొందే ఛాన్స్ ఉంది. కేన్సర్ నిర్ధారణకు రూపొందించిన ఈ జాకెట్ వేసుకుంటే…శరీరంలోని టెంపరేచర్స్ ఆధారంగా వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చు. ఒకవేళ జాకెట్ ధరించడానికి ఇష్టపడని వారికి కెమెరా కూడా ఉంది. ఒక అడుగు దూరం నుంచే స్క్రీనింగ్ చేసే కెమెరాను వినియోగిస్తారు.

Read More : IT ఉద్యోగులకు గుడ్ న్యూస్ : దీపావళికి రాయదుర్గం మెట్రో
కేన్సర్ కణాలున్న భాగంలోని శరీర ఉష్ణోగ్రతను బట్టి థర్మల్ ఇమేజస్ ఏర్పడుతాయని పరీక్షలు నిర్వహిస్తున్న మురాటా సంస్థ వెల్లడించింది. 40 ఏళ్లలోపు వారిలోనూ కేన్సర్ వచ్చే అవకాశాన్ని గుర్తించవచ్చు. పబ్లిక్ హెల్త్‌లో భాగంగా ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు మహిళఆ పారిశుధ్య కార్మికులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రొమ్మ కేన్సర్ ఉచిత స్క్రీనింగ్‌లను జీహెచ్ఎంసీ చేపట్టింది. పేద మహిళల సదుపాయార్థం నగరంలోని బస్తీ దవాఖానాల్లోనూ అందుబాటులోకి తెస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు.