లక్షదీవుల నుంచి తెలంగాణ వరకు కేరళ, దక్షిణ కర్నాటక, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీలో వర్షాలు కురువనున్నాయి. రాబోయే మూడు రోజులు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు.
లక్ష దీవుల ప్రాంతం నుంచి తెలంగాణ వరకు కేరళ, దక్షిణ ఇంటీరియిర్ కర్నాటక, రాయలసీమ మీదుగా 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ మధ్య ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపారు. దీంతో తెలంగాణలో శుక్రవారం, శనివారాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
రానున్న 24 గంటల్లో కోస్తాలో వర్షాలు కురుస్తాయి. మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వెల్లడించింది.