ప్రాణం కాపాడిన పోలీసు

  • Publish Date - August 30, 2019 / 07:31 AM IST

హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో క్షణాల్లో పెద్ద ప్రమాదం తప్పింది. గురువారం (ఆగస్ట్ 29, 2019) రోజు ఓ వ్యక్తి కదులే రైల్లోంచి దిగుతూ.. రైలుకు, ప్లాట్‌ఫామ్‌ కు మధ్య చిక్కుకున్నాడు. అదృష్టవశాత్తు అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ అతన్ని బయటికి లాగి ప్రాణాలు కాపాడారు. దీంతో ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. 

అంతేకాదు ప్రయాణికుడిని సురక్షితంగా బయటికి లాగిన కానిస్టేబుల్‌ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకే ప్రయాణికులు రైలు ఎక్కేటప్పుడు కాస్త ఆలస్యం అయినా మంచిదే గాని జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తున్నారు. కానిస్టేబుల్ రావడం క్షణం ఆలస్యం అయి ఉంటే అతడు శవమయ్యేవాడు. 

అయితే ఇలాంటి ఘటనలు జరిగినపుడు విలువైన ప్రాణాలు కాపాడేందుకు రైల్వే పోలీసులు వెంటనే స్టేషన్‌ మాస్టర్‌ లేదా డ్రైవర్‌ను అలెర్ట్‌ డివైజ్‌లు తెచ్చే ఆలోచన చేయాలని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ కు ట్వీట్‌ చేస్తున్నారు.