తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. భారతదేశంలో బీజేపీ పార్టీనే అసలు ఉగ్రవాదానికి కారణమన్నారు. ఉగ్రవాదం పెరగడానికి ఆ పార్టీయే కారణమని విమర్శించారు. బీజేపీ నేతలకు ప్రభుత్వాన్ని నడపడానికి చేతకాదన్నారు. ఈమేరకు సోమవారం (ఏప్రిల్ 22, 2019)న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏదో ఒక ఆరోపణ చేయాలని చూస్తుంటారని మండిపడ్డారు. పని పాట లేని వ్యక్తులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలకు సలహాలు, సూచనలు చేయాలి తప్పా ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. దేశ భద్రత విషయాల్లో బీజేపీ నాయకులు జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. దేశ భద్రత, లాండ్ అండ్ ఆర్డర్ పై మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నారు.
బండారు దత్తాత్రేయ ఏది పడితే అది, పనికిరాని విషయాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలానే మాట్లాడారని ఫైర్ అయ్యారు. ‘నీకు టికెట్ కూడా ఇవ్వలేదు.. రిటైర్ మెంట్ అయి ఇంట్లో కూర్చోవాలి’ అని బండారు దత్తాత్రేయకు సూచించారు.