ఈఎస్ఐ కేసులో మరో ముగ్గురు అరెస్టు

  • Publish Date - October 11, 2019 / 12:07 PM IST

ఈఎస్‌ఐ కేసులో మరో ముగ్గురిని ఏసీబీ అరెస్ట్‌ చేసింది. దీంతో అరెస్టుల సంఖ్య 16కు చేరింది. ఈఎస్‌ఐ ఆస్పత్రులకు చెందిన మందులు పెద్ద మొత్తంలో ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిపోతున్నాయి. ఈ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేసిన ఏసీబీ మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకుంది. తేజా ఫార్మా ఎండీ రాజేశ్వరరెడ్డి, చర్లపల్లి డిస్పెన్సరీ ఫార్మసిస్ట్‌ లావణ్య, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి పాషాను అరెస్ట్‌ చేశారు ఏసీబీ అధికారులు. రాజేశ్వరరెడ్డి మందుల కొనుగోలులో రూ.28 కోట్లు అవకతవకలకు పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ స్కామ్‌లో ప్రైవేట్‌ ఆస్పత్రుల పాత్రను గుర్తించారు.

డైరెక్టర్‌ దేవికారాణితోపాటు ఆరుగురిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. పటాన్‌చెరు, చర్లపల్లి, వనస్థలిపురం, ఆర్‌సీపురం డిస్పెన్సరీ.. మందుల విక్రయాల్లో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈఎస్‌ఐ మందులను ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించినట్లుగా గుర్తించారు. పెద్ద మొత్తంలో ఈఎస్‌ఐ మందులను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించినట్లుగా గుర్తించారు. అక్రమంగా కొనుగోలు చేసిన ప్రైవేట్‌ ఆస్పత్రులపై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు.