TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు

  • Publish Date - April 29, 2019 / 12:18 PM IST

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువును   మరోసారి పొడిగించింది. మే 2 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అసలైతే ఏప్రిల్ 29తో గడువు ముగియాలి కాని ఏప్రిల్ 28న రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కౌంటర్లు పనిచేయకపోవడంతో ఇంటర్‌ బోర్డుపై విమర్శలు వచ్చాయి. తొలుత ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 27 తుది గడువుగా నిర్ణయించారు. ఆ తర్వాత 29కి  తాజాగా మళ్లీ మే 2వ తేదీకి పొడిగించారు. 

ఇంటర్ ఫలితాలపై సోమవారం (ఏప్రిల్ 29) హైకోర్టులో విచారణ జరిగింది. మే 8 వరకు రీ వెరిఫికేషన్ పూర్తిచేస్తామని ఇంటర్ బోర్డు హైకోర్టుకు తెలిపింది. రీ వేరిఫికేషన్, రీ వెరిఫికేషన్‌లో ఎంతమంది విద్యార్థులు ఉత్తీర్ణులవుతారో పరిశీలించాక తదుపరి చర్యలు ఆలోచిద్దామని హైకోర్టు తెలిపింది.