ప్రేమలో పడ్డారా..ఇక మీ పని అయిపోయినట్టే అంటూ మన స్నేహితులను ఆటపట్టిస్తాం. కానీ..ప్రేమలో పడితే ఆ అనుభూతి ఎంతో మధురం. ప్రేమలో ఉన్నప్పుడు ఎన్ని పనులున్నా సరే మనం ప్రేమించే వారిని కలవాలని ఆరాటపడుతుంటాం. ఆ క్షణం ఎంతో అందంగా ఉంటుంది. కలిసిన తర్వాత వారితో గడిపిన క్షణాలను పదే పదే తలుచుకుంటు ఆనదిస్తాం. ఆ జ్ఞాపకాలు ఆనందమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రతీ రోజు రకరకాల కారణాలతో మనసు ఒత్తిడిగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఒక్క నిమిషం కళ్లు మూసుకుని మీ లవర్ని గాని వారితో గడిపిన అందమైన క్షణాలను గాని గుర్తుతెచ్చుకోవడం వల్ల BP పరారైపోతుందని డాక్టర్ అవసరం లేకుండానే సమస్య తగ్గిపోతుందని చెబుతున్నారు అరిజోన్ యూనివర్సిటీ మానసిక నిపుణులు.
శాస్త్రవేత్తలు రెండు విభాగాలపై పరీక్ష నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు. అందులో లవర్స్‌ని తలుచుకుని పనులు నిర్వహించిన వారికి టాస్కులో మంచి ఫలితం కనిపించిందట.. తలుచుకోని వారు BP పెంచుకుని గుండెవేగాన్ని పెంచుకున్నారట.
సో.. బాగా కోపం వచ్చినప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు గబగబ మందులు మింగి వైద్యుల దగ్గరికి పరిగెత్తడం కంటే.. ఈ చిట్కా పాటించి చూడండి అంటున్నారు శాస్త్రవేత్తలు.