మద్యం షాపులకు వార్నింగ్ : రూ.2లక్షలు ఫైన్, లైసెన్స్ సస్పెండ్

దసరా పండుగ వేళ మద్యం షాపుల ఓనర్లకు తెలంగాణ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఎమ్మార్పీ ధరకన్నా ఎక్కువకు మద్యం అమ్మితే రూ.2 లక్షలు ఫైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయడంతోపాటు వారం

  • Publish Date - October 7, 2019 / 10:47 AM IST

దసరా పండుగ వేళ మద్యం షాపుల ఓనర్లకు తెలంగాణ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఎమ్మార్పీ ధరకన్నా ఎక్కువకు మద్యం అమ్మితే రూ.2 లక్షలు ఫైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయడంతోపాటు వారం

దసరా పండుగ వేళ మద్యం షాపుల ఓనర్లకు తెలంగాణ ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. పండుగ సీజన్ కదా అని.. ఎమ్మార్పీ ధరకన్నా ఎక్కువకు మద్యం అమ్మితే తాట తీస్తామంది. లిక్కర్ ఏదైనా ఎమ్మార్పీ రేటుకే అమ్మాలని తేల్చి చెప్పింది. కాదని ఎక్కువ రేట్లకు అమ్మితే.. రూ.2 లక్షలు ఫైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయడంతోపాటు వారం రోజులు షాపు లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ అధికారులు ప్రకటించారు.

అక్టోబర్ 4,5 తేదీల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నల్గొండ, వనపర్తి, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లోని 8 వైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపుల్లో ఎమ్మార్పీకి మించి మద్యం అమ్మినట్టుగా టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. చర్యలకు రెడీ అయ్యారు. దసరా, బతుకమ్మ పండుగల రద్దీని సొమ్ము చేసుకునేందుకు ఏ వైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపు యజమాని ప్రయత్నించినా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే మద్యం షాపులపై టాస్క్‌ఫోర్స్ అధికారులు నిఘా పెట్టారు.

ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్లకు అదనంగా స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీంలు నాలుగు, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీంలు 10, డిస్ట్రిక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీంలు 34 ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీకి మించి అమ్మే వ్యాపారులపై ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు పాత 10 జిల్లాల్లో 10 కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూంలు ఏర్పాటు చేశారు. ఫిర్యాదులు అందగానే దాడులు చేయాలని ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోలు, జిల్లా ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో.. దసరా, బతుకమ్మ అతి పెద్ద పండుగలు. ఆధ్యాత్మికత, ఆనందం కలిసిన ఈ పండుగలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సమయంలో నాన్ వెజ్ తో పాటు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతాయి. దీంతో.. లిక్కర్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలో.. మద్యంపై రేటు పెంచి దండుకుందామని చూస్తే.. మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు.

ఫిర్యాదు చేయాల్సిన ఫోన్​ నెంబర్:
స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూం: 040-24733056
హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 040-24746884
రంగారెడ్డి: 040-24600450
ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 08732-220229
నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 08762-237551
మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 08455-271232
నల్గొండ: 08682-224271
మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 08542-242488
వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 08702-577412
కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 08782-262330
ఖమ్మం: 08742-224342.