ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ఆత్మనిర్భరత

Aatmanirbharta: ఆత్మ నిర్భరత అనే పదం ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో హిందీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2020గా నిలిచింది. రోజుల తరబడి సాధించిన విజయ లక్ష్యాలను లెక్కలేనంత మంది భారతీయులు మహమ్మారి సమయంలో సాధించిన ఘనత’ అంటూ దానికి వివరణ ఉంది. అడ్వైజరీ ప్యానెల్ లో ఉన్న భాషా నిపుణులైన కృతికా అగర్వాల్, పూనమ్ నిగమ్ సాహే, ఇమోజెన్ ఫాక్సెల్ ఈ పదాన్ని ఎంపిక చేశారు.

ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ అనే పదం గడిచిన సంవత్సరానికి సంబంధించిన స్వభావం, మూడ్, ముందుచూపు గురించి తెలియజేస్తుంది. దాంతోపాటు సంప్రదాయ ప్రత్యేకత ఉన్న వాటికి ప్రాధాన్యత ఉంటుంది.

మహమ్మారి ప్రబలుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ.. ఇండియా కోలుకోవడానికి రికవరీ ప్యాకేజీ అనౌన్స్ చేశారు. దేశంగా, ఆర్థిక వ్యవస్థగా, సామాజికంగా ప్రతి ఒక్కరూ నిలదొక్కుకోవడానికి హెల్ప్ అవుతుందని వెల్లడించారు. ఇవన్నీ ఆత్మ నిర్భరతలో భాగంగానే ప్రధాని వివరించారు.

ఈ ఆత్మనిర్భరత నినాదంతో ఇండియాలో భారీ స్థాయిలో వ్యాక్సిన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ చేశారు. రిపబ్లిక్ డే పరేడ్ సమయంలోనూ బయోటెక్నాలజీ డిపార్ట్ మెంట్ ఈ కాంపైన్ ను హైలెట్ చేసింది. దాని వల్లనే వ్యాక్సిన్ డెవలప్ మెంట్ కుదిరిందని తెలిపింది.

ఆత్మనిర్భరత అనే పదం యువతలోనూ, పెద్ద వాళ్లలోనూ స్థైర్యాన్ని నింపింది. ఐసోలేషన్ సమయం పెంచుతున్నా.. ఎక్కడా తడబాటు కనిపించలేదు. ఇతర సమస్యలను అధిగమించి స్వతహాగా నిలిచేలా చేసింది. గతంలోనూ ఇందులో ఆక్స్‌ఫర్డ్ హిందీ వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా.. 2017లో ఆధార్, 2018లో నారీ శక్తి, 2019లో సంవిధాన్ లు ఆ హోదా దక్కించుకున్నాయి.