Team India Jersey : భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్‌గా డ్రీమ్ 11.. బీసీసీఐ ప్రకటన

భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్‌గా డ్రీమ్ 11ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) శనివారం ప్రకటించింది. జూన్ 1వతేదీ శనివారం నుంచి ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్11ని భారత క్రికెట్ జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా బీసీసీఐ పేర్కొంది....

lead sponsor for Indian cricket team

Team India New Jersey : భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్‌గా డ్రీమ్ 11ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) శనివారం ప్రకటించింది. జూన్ 1వ తేదీ శనివారం నుంచి ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్11ని భారత క్రికెట్ జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా బీసీసీఐ పేర్కొంది. (BCCI announces Dream11 as lead sponsor) ఈ సంవత్సరం ప్రారంభంలో మార్చి నెలలో ముగిసిన బైజూస్ కాంట్రాక్ట్‌ను డ్రీమ్ 11 (Dream11) భర్తీ చేసింది.

Neeraj Chopra 5 Fitness Secrets : నీరజ్‌చోప్రా ఫిట్‌నెస్ సీక్రెట్ ఏమిటంటే…

గేమింగ్ ప్లాట్‌ఫారమ్ ప్రపంచంలోని భారత క్రికెట్ బోర్డుతో మూడు సంవత్సరాల పాటు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డొమినికాలోని రోసోలోని విండ్సర్ పార్క్‌లో ప్రారంభ టెస్టుతో జులై 12న ప్రారంభమయ్యే వెస్టిండీస్ పర్యటనలో డ్రీమ్11 టీమ్ ఇండియా జెర్సీలో కనిపించనుంది.

Maharashtra Bus Fire : బస్సు అగ్నిప్రమాద మృతులకు సీఎం,పీఎం ఎక్స్‌గ్రేషియా

‘‘నేను డ్రీమ్ 11ని అభినందిస్తున్నాను, వారిని మళ్లీ బోర్డులోకి స్వాగతిస్తున్నాను. బీసీసీఐ అధికారిక స్పాన్సర్ నుంచి ఇప్పుడు ప్రధాన స్పాన్సర్‌గా నిలచింది. ఇది భారత క్రికెట్ అందించే నమ్మకం, విలువ, సామర్థ్యం, వృద్ధికి ప్రత్యక్ష నిదర్శనం’’ అని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ మీడియాకు తెలిపారు.

Shaheen Afridi New World Record : పాక్ క్రికెటర్ షాహీన్ ఆఫ్రీది సరికొత్త వరల్డ్ రికార్డ్

‘‘మేం క్రికెట్ పట్ల మా ప్రేమను ఒక బిలియన్ భారతీయ క్రికెట్ అభిమానులతో పంచుకుంటున్నాం, జాతీయ జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా మారడం గర్వించదగ్గ విషయం’’ అని డ్రీమ్ 11 సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన హర్ష్ జైన్ అన్నారు.