Bharat jodo yatra: ఇటువంటి సత్యాలను బీజేపీ దాచలేదు: రాహుల్ గాంధీ

బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇవాళ ఆయన కర్ణాటకలోని తుముకూర్ లో భారత్ జోడో యాత్రలో పాల్గొని మీడియా సమావేశంలో మాట్లాడారు.‘‘బ్రిటిష్ వారికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సాయం చేసింది. సావర్కర్ బ్రిటిష్ వారి నుంచి స్టైఫండ్ అందుకునే వారు. స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ ఎక్కడా కనపడలేదు. ఇటువంటి సత్యాలను బీజేపీ దాచలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాతంత్ర్యం కోసం పోరాడారు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

Congress MP Rahul Gandhi unlikely to contest party presidential polls sasy prarty sources

Bharat jodo yatra: బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇవాళ ఆయన కర్ణాటకలోని తుముకూర్ లో భారత్ జోడో యాత్రలో పాల్గొని మీడియా సమావేశంలో మాట్లాడారు.‘‘బ్రిటిష్ వారికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సాయం చేసింది. సావర్కర్ బ్రిటిష్ వారి నుంచి స్టైఫండ్ అందుకునే వారు. స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ ఎక్కడా కనపడలేదు. ఇటువంటి సత్యాలను బీజేపీ దాచలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాతంత్ర్యం కోసం పోరాడారు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

‘‘మేము నూతన విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నాము.. ఎందుకంటే, అది భారతదేశ విధానాలపై దాడి చేస్తున్నట్లు ఉంది. మన చరిత్రను వక్రీకరిస్తోంది. కొందరి చేతుల్లోనే అధికారం ఉండాలని చెప్పేలా ఉంది. మన సంస్కృతికి ప్రతిబింబంలా నిలిచే వికేంద్రీకరణ విద్యా విధానం మనకు అవసరం’’ అని రాహుల్ గాంధీ చెప్పారు.

కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీ పెట్టుబడులు పెడుతుండడంపై రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘అదానీకి రాజస్థాన్ ప్రభుత్వం ఏ రకంగానూ ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వలేదు. నేను కార్పొరేట్లకి వ్యతిరేకం కాదు. నేను గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిస్తాను. అదానీకి చట్టవిరుద్ధంగా రాజస్థాన్ ప్రభుత్వం వ్యాపార అవకాశాలు కల్పిస్తే నేను దాన్ని వ్యతిరేకిస్తాను. దేశంలోని వ్యాపారాలన్నీ ఇద్దరు-ముగ్గురి చేతుల్లో ఉండేలా బీజేపీ చేసింది’’ అని అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..