మాస్కులు పెట్టుకోలేదని ఫైన్‌లు వేస్తే రూ.30కోట్లు వచ్చిపడ్డయ్

BMC fines: రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి పుంజుకుంటున్న కరోనా కేసుల దృష్ట్యా మాస్కులు తప్పనిసరి చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. యథేచ్ఛగా తిరిగేస్తుండటంతో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ మేరకు నిబంధనలు కఠినతరం చేసి మాస్క్ పెట్టుకోని వారి నుంచి ఫైన్స్ వసూలు చేయడం మొదలుపెట్టింది. అలా చేసిన మొత్తంలో కేవలం 14వేల 600మంది నుంచే రూ.29లక్షల వసూలు చేసినట్లు తెలిసింది.

అయితే మాస్క్ రూల్ వచ్చినప్పటి నుంచి వసూల్ చేసిన మొత్తం రూ.30.5కోట్లు అయిందని వెల్లడించారు. స్టేట్‌మెంట్ ప్రకారం.. 22వేల 976మంది మాస్క్ ఉల్లంఘన కింద ఫిబ్రవరి 23న రూ.45.95లక్షలు కట్టారు. ఆ వారం పూర్తయ్యేసరికి బీఎంసీ రూ.60లక్షలు వసూలు చేసింది.

బీఎంసీ కమిషనర్ చాహల్ ప్రకటించిన తర్వాత ముంబైలో కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి నియమాలు పెట్టారు. కొత్త గైడ్ లెన్స్ ప్రకారం.. మాస్క్ వేసుకోని వారు రూ.200 ఫైన్ చెల్లించాల్సిందే. ప్రతి రోజూ దాదాపు 25వేల మంది దొరుకుతున్నారని.. వారిని పట్టుకునేందుకు మార్షల్స్ అధికారులను పెంచి మాస్క్ పెట్టుకోని వారిని గుర్తిస్తున్నామని వివరించారు.

మంగళవారానికి ముంబై పోలీస్, సెంట్రల్, వెస్టరన్ రైల్వేస్ లాంటి డిఫరెంట్ ఏజెన్సీల మొత్తం ఫైన్స్ కలిపి.. రూ.30కోట్లు దాటేసింది. సెంట్రల్, వెస్టరన్ రైల్వేస్ కలిపి రూ.91వేల 800ఫైన్ వసూలు చేశారు. బీఎంసీ మాత్రం రోజుకు సగటున 13వే మంది నుంచి రూ.25లక్షల ఫైన్ వసూలు చేస్తుంది. ఫైన్ కట్టడానికి డబ్బులు లేవని చెప్పిన వారిని వీధులు శుభ్రం చేయడం లాంటి కమ్యూనిటీ సర్వీసులు చేయిస్తున్నారు.

గతవారం సీఎం ఉద్ధవ్ ఠాకరే మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చాం. వీటిని పట్టించుకోకపోయినా.. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరిగినా.. మరోసారి లాక్ డౌన్ విధించాలా అనే విషయాన్ని తప్పక ఆలోచిస్తామని అన్నారు.