×
Ad

Pakistani woman Seema Haider : హిందూమతం స్వీకరించాను, పాక్‌కు తిరిగి వెళ్లను…సీమాహైదర్ వెల్లడి

ప్రేమికుడి కోసం దేశంతోపాటు భర్తను వదిలి నలుగురు పిల్లల్ని తీసుకొని భారతదేశానికి వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ ప్రేమకథ వినూత్న మలుపులు తిరుగుతోంది....

  • Published On : July 11, 2023 / 06:27 AM IST

Pakistani woman love story

Pakistani woman Seema Haider : ప్రేమికుడి కోసం దేశంతోపాటు భర్తను వదిలి నలుగురు పిల్లల్ని తీసుకొని భారతదేశానికి వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ ప్రేమకథ వినూత్న మలుపులు తిరుగుతోంది. పబ్ జి మొబైల్ గేమ్ ద్వారా యువకుడి పరిచయం ప్రేమగా మారడంతో పాకిస్థాన్ దేశం వదిలి పారి పోయి భారతదేశానికి వచ్చి, తన ప్రియుడైన సచిన్ మీనాను పెళ్లాడి నోయిడాలో కాపురం పెట్టిన సీమా తాజాగా పలు సంచలన విషయాలు వెల్లడించారు. (Seema Haider, Sachin)

సచిన్, సీమాల ప్రేమ కథ ఆసక్తికరం

తాను తిరిగి పాకిస్థాన్ దేశానికి వెళ్లనని స్పష్టం చేశారు. (Don’t want to go back) పాక్ నుంచి అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించినందుకు అరెస్ట్ అయి బెయిలుపై విడుదలైన సీమా మంగళవారం మీడియాతో పలు విషయాలు పంచుకున్నారు. తాను హిందువుగా మారానని, భారతీయ సంస్కృతిని హృదయపూర్వకంగా స్వీకరించానని సీమా చెప్పారు. 2019వ సంవత్సరం నుంచి సాగిన సచిన్, సీమాల ప్రేమ కథ ఆసక్తికరంగా మారి వార్లల్లోకి ఎక్కింది.

Seema Haider

హిందువుగా మారాను…

తాను హిందువుగా మారి మెడలో రాధే రాధే పట్టీని ధరించానని, నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టుకోవడం, ముకుళిత హస్తాలతో ప్రజలకు అభివాదం చేసి పలకరించడం, ఆశీర్వాదం కోసం పెద్దల పాదాలు తాకడం, దేవుడికి పూజలు చేయడం తనకెంతో ఇష్టమని వ్యాఖ్యానించారు. తన భర్త హిందూమతాన్ని స్వీకరించినందున తాను వెల్లుల్లిని తినడం లేదని, తాను పూర్తిగా శాకాహారిగా జీవనశైలిని అవలంబించానని ఆమె చెప్పారు.

సచిన్ అంటే అపారప్రేమ

తన భార్య, పిల్లల్ని పాకిస్థాన్ దేశానికి తిరిగి పంపించాలని పాక్ దేశానికి చెందిన భర్త విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో తాను తన భర్తతో 2020 నుంచి దూరంగా ఉన్నానని సీమా చెప్పారు. (illegally entered India to be with lover) పనినిమిత్తం తన భర్త గులాం సౌదీ అరేబియాకు వెళ్లాడని, గతంలో తన ముఖంపై కారంపొడి చల్లి దుర్భాషలాడాడని చెప్పారు. తన ప్రేమికుడైన సచిన్ పై అపారప్రేమ ఉందని, తాను అతనితో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు.

Seema Haider puja

పూజలు చేస్తున్న పాక్ మహిళ 

తన పిల్లలు కూడా సచిన్ ను తండ్రిగా ఆలింగనం చేసుకున్నారని సీమా చెప్పింది. పాక్ మహిళ ప్రేమ కథ ఉదంతం వైరల్ కావడంతో పలువురు ఈ ప్రేమజంట జీవితానికి మద్ధతుగా నిలిచేందుకు వీలుగా ఆర్థిక సహాయం చేయడానికి సీమా అత్తమామల ఇంటికి వచ్చారు. సీమా నుదుట బొట్టు పెట్టుకొని ముకుళిత హస్తాలతో తులసీ చెట్టు చుట్టూ తిరగడం, దేవుడి గదిలో పూజలు చేస్తుండటం అందరినీ ఆకట్టుకుంటోంది.