Union Budget 2023: టెంపుల్ బార్డర్ ఎరుపు రంగు చీరలో నిర్మల.. రాష్ట్రపతిని కలిసిన ఆర్థిక మంత్రి
కాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. బడ్జెట్ గురించి ద్రౌపది ముర్ముకు వివరాలు తెలిపారు. బడ్జెట్ ట్యాబ్ తో ఆమె బృందం రాష్ట్రపతి భవన్ కు వెళ్లింది. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ సంప్రదాయ టెంపుల్ బార్డర్ ఎరుపు రంగు చీర ధరించారు.
- T Venkateshwarlu
- Updated on- February 1, 2023 / 10:27 AM IST
Union Budget 2023
Union Budget 2023: కాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. బడ్జెట్ గురించి ద్రౌపది ముర్ముకు వివరాలు తెలిపారు. బడ్జెట్ ట్యాబ్ తో ఆమె బృందం రాష్ట్రపతి భవన్ కు వెళ్లింది. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ సంప్రదాయ టెంపుల్ బార్డర్ ఎరుపు రంగు చీర ధరించారు.
ఈ భారతీయ వస్త్రాలను సాధారణంగా కాటన్, సిల్క్ తో తయారు చేస్తారు. గోల్డెన్ వర్క్, బ్లాక్ బార్డర్ చీరను ధరించి దానికి మ్యాచ్ అయ్యే ఎరుపు రంగు పెట్టెలో ఆమె బడ్జెట్ ట్యాబ్ ను తీసుకువచ్చారు. ప్రేమ, నిబద్ధత, శక్తి, ధైర్యాన్ని ఎరుపు రంగు సూచిస్తుంది. హిందూ సంప్రదాయం ప్రకారం శక్తికి ప్రతీక అయిన దుర్గామాతనూ గుర్తుచేస్తుంది.
ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మంత్రి వర్గం ఆమోదించాక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. బడ్జెట్ లో పేద, మధ్య తరగతి ప్రజల విషయంలో అనుకూల నిర్ణయాలు ఉంటాయని వివిధ వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
