Nitish kumar slams amit shah: అమిత్ షా కేవలం 20 ఏళ్ల క్రితమే రాజకీయాల్లోకి ప్రవేశించారు: సీఎం నితీశ్ ఎద్దేవా

‘జేపీ దేనికోసం పోరాడారన్న విషయంపై అమిత్ షాకు అవగాహన ఉందా? మేము నేరుగా జేపీ ఉద్యమం (1974) నుంచి ఆయన గురించి తెలుసుకున్నాం. కేవలం 20 ఏళ్ల క్రితం రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వారి మాటలను పట్టించుకోను’’ అని ఎద్దేవా చేశారు. అన్ని ఆంగ్ల దినపత్రికలు బీజేపీకి అనుకూలంగా కథనాలు ప్రచురిస్తున్నాయని చెప్పారు.

Nitish kumar slams amit shah: కేంద్ర మంత్రి అమిత్ షాపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మండిపడ్డారు. అమిత్ షా కేవలం 20 ఏళ్ల క్రితమే రాజకీయాల్లోకి ప్రవేశించారని, అటువంటి వ్యక్తి చేస్తున్న విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వబోనని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని సారన్ జిల్లాలో నిన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి జనతా పార్టీ దివంగత నేత జయప్రకాశ్ నారాయణ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ… జయప్రకాశ్ నారాయణ్ ఆశయాలను నితీశ్ కుమార్ అధికారం కోసం గాలికి వదిలేశారని విమర్శలు గుప్పించారు.

ఇప్పుడు నితీశ్ కుమార్ కాంగ్రెస్ ఒడిలో కూర్చున్నారని అన్నారు. దేశంలో 1974లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని జయప్రకాశ్ నారాయణ్ బిహార్ నుంచే మొదలుపెట్టారని అమిత్ షా చెప్పారు. కొందరు జయప్రకాశ్ నారాయణ్ తమకు ఆదర్శమని చెబుతూనే మరోవైపు అధికారం కోసం పాకులాడుతుంటారని అన్నారు. దీనిపైనే నితీశ్ కుమార్ ఇవాళ స్పందించారు.

‘‘జేపీ దేనికోసం పోరాడారన్న విషయంపై అమిత్ షాకు అవగాహన ఉందా? మేము నేరుగా జేపీ ఉద్యమం (1974) నుంచి ఆయన గురించి తెలుసుకున్నాం. కేవలం 20 ఏళ్ల క్రితం రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వారి మాటలను పట్టించుకోను’’ అని ఎద్దేవా చేశారు. అన్ని ఆంగ్ల దినపత్రికలు బీజేపీకి అనుకూలంగా కథనాలు ప్రచురిస్తున్నాయని చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు