Republic Day 2024: తొమ్మిదేళ్లు.. తొమ్మిది తలపాగాలు.. మోదీ ఏయే ఏడాది ఎలాంటి తలపాగా ధరించారో తెలుసా?

భారతావని గణతంత్ర వేడుకలను సిద్ధమైంది. మోదీ ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతిసారి ఒక్కో రకం తలపాగాతో కనపడతారు.

ప్రధాని నరేంద్ర మోదీ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి ఏడాది ఒక్కో తలపాగాతో పాల్గొన్నారు. 2015 జనవరి 26 నుంచి ప్రతి ఏటా మోదీ ప్రత్యేక తలపాగాతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. గత ఏడాది ప్రధాని మోదీ రాజస్థాన్ రాష్ట్రంకు చెందిన జోధ్‌పురి పక్రంగి సఫా ధరించారు. భారతావని గణతంత్ర వేడుకలను సిద్ధమైంది. ఈ సారి ఏ తలపాగాతో కనపడతారన్న ఆసక్తి నెలకొంది.

2023 సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థానీ తలపాగా ధరించారు. పొడవైన వస్త్రం వేలాడేవిధంగా అనేక రంగులతో కూడిన ఈ తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

2022 సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ సాంప్రదాయ టోపీని ధరించారు. దీనిని బ్రహ్మకమల్ అనికూడా పిలుస్తారు.

2021 సంవత్సరంలో ప్రధాని మోదీ గుజరాత్ లోని జామ్‌నగర్ నుంచి ప్రత్యేక తలపాగా ధరించారు. ఈ తలపాగాను జామ్‌నగర్ రాజకుటుంబం బహుమతిగా అందించారు.

2020 సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలుపు రంగు కుర్తా, చురీదార్ పైజామా ధరించారు. దానిపై నీలిరంగు సద్రీని ధరించారు. కాషాయం రంగు తలపాగా ధరించారు.

2019 సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోదీ రంగుల తలపాగా ధరించారు.

2018 సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోదీ జోధ్‌పూర్‌‌కు చెందిన బహుళవర్ణ తలపాగా ధరించారు. ఈ గణతంత్ర వేడుకల్లో తొలిసారి పది దేశాల అధినేతలు పాల్గొన్నారు.

Republic Day 2024: రిపబ్లిక్ డే.. 1927 నుంచి 1949 వరకు ఏం జరిగిందో తెలుసా?

2017 సంవత్సరంలో ప్రధాని మెదీ గులాబీ రంగు తలపాగా ధరించారు.

2016 సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోదీ జోధ్‌పురి దుస్తులు ధరించారు. తలపై పసుపు తలపాగా ధరించారు.

2015 సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అప్పుడు రాజస్థానీ బంధాని తలపాగా ధరించారు.

ట్రెండింగ్ వార్తలు