Fishing Boat Accident : కేరళలో ఫిషింగ్ బోట్ ప్రమాదం, ఒకరి మృతి, ముగ్గురు గల్లంతు
కేరళ రాష్ట్రంలోని అరేబియా సముద్ర తీరంలో సోమవారం తెల్లవారుజామున పడవ బోల్తా పడిన దుర్ఘటనలో ఓ మత్స్యకారుడు మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటన తిరువనంతపురం జిల్లాలోని ముతలపోజిలో చోటుచేసుకుంది....
- saleem sk
- Published On : July 10, 2023 / 10:41 AM IST
Fishing Boat Accident
Fishing Boat Accident : కేరళ రాష్ట్రంలోని అరేబియా సముద్ర తీరంలో సోమవారం తెల్లవారుజామున పడవ బోల్తా పడిన దుర్ఘటనలో ఓ మత్స్యకారుడు మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటన తిరువనంతపురం జిల్లాలోని ముతలపోజిలో చోటుచేసుకుంది. (3 Missing In Fishing Boat Accident) కుంజుమోన్ (42) మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, మరో ముగ్గురు-రాబిన్ (42), బిజు (48), బిజు (55) అదృశ్యమయ్యారని అంజుతెంగు పోలీసులు తెలిపారు.
Heavy Rain Alert : ఇళ్లలోనే ఉండండి..ప్రజలకు హిమాచల్ సీఎం హెచ్చరిక
సోమవారం ఉదయం సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో పడవ బోల్తా పడింది. మత్స్యకారులు మెకనైజ్డ్ బోట్‌లో ఉన్నారు. తప్పిపోయిన వ్యక్తుల కోసం గాలిస్తున్నామని తీరప్రాంత పోలీసు అధికారులు చెప్పారు.
పెరుమతుర వద్ద ఉన్న ముతలపోజి వామనపురం నది, కడినంకులం సరస్సు అరేబియా సముద్రంలో కలిసే ప్రదేశం వద్ద ఈ బోటు ప్రమాదం జరిగింది. భారీవర్షాలతో అతలాకుతలమైన కేరళలో పడవ ప్రమాదం జరిగింది.
