టాప్‌లెస్ న్యూడ్ ఫొటోతో రిహానా.. దుమారం రేపుతున్న ట్వీట్
- Subhan Ali Shaik
- Published On : February 16, 2021 / 03:12 PM IST
Rihanna: రైతుల ఆందోళనపై కొద్ది రోజుల క్రితం ట్వీట్ చేసి కేంద్ర ప్రభుత్వం, సెలబ్రిటీల నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొంది. ఎట్టకేలకు అంతర్గత విషయాన్ని రాజకీయం చేయొద్దని చెప్పడంతో సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి రచ్చ లేపేందుకు రెడీ అయింది. మెడలో గణేశ్ లాకెట్ వేసుకుని టాప్ లెస్ గా న్యూడ్ ఫొటో దిగింది.
దానిని ట్విట్టర్ లో పోస్టు చేసింది. అమెరికా పాప్ సింగర్ చేసిన పనికి నెటిజన్లు చివాట్లు పెట్టడంతో పాటు.. కావాలనే ఇలా చేస్తుందని తిట్టిపోస్తున్నారు. దీనిపై భారతీయ జనతా పార్టీ, శివసేన విమర్శలు గుప్పిస్తున్నారు.
రిహానాను రైతుల ఆందోళన ట్వీట్ చేసినప్పుడు సపోర్ట్ చేశారంటూ కాంగ్రెస్ ను కూడా తిడుతున్నారు. ‘రిహానా ఇలాంటి పోస్ట్ పెట్టడం వెనుక ఉద్దేశ్యమేంటి. తాను దురుద్దేశ్యంతో పనిచేస్తుందనడానికి ఇదొక సాక్ష్యం. ఇంకా కాంగ్రెస్ సపోర్ట్ చేయాలనుకుంటుందా’ అని బీజేపీ లీడర్ రామ్ కదమ్ అంటున్నారు. .
when @PopcaanMusic said “me nuh wan ya wear no lingerie tonight fa me girl” @SavageXFenty pic.twitter.com/bnrtCZT7FB
— Rihanna (@rihanna) February 15, 2021
